Share News

ఫ్రాన్స్ చరిత్రాత్మక కట్టడం టౌన్ హాల్‌కు నిప్పంటించిన ఆందోళనకారులు!

ABN , Publish Date - Oct 18 , 2026 | 08:47 PM

ఫ్రాన్స్‌లో 143 ఏళ్ల పురాతన కట్టడమైన లిమోజెస్ టౌన్‌హల్‌ మంటల్లో చిక్కుకుంది. నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా నిరసనకారులు ఈ చరిత్రాత్మక కట్టడానికి నిప్పంటించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఫ్రాన్స్ చరిత్రాత్మక కట్టడం టౌన్ హాల్‌కు నిప్పంటించిన ఆందోళనకారులు!
fire broke out in france histarical town hall

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో చరిత్రాత్మక కట్టడమైన లిమోజెస్ టౌన్‌హాల్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో భవనం పైకప్పు కూలడంతో మూడింట రెండొంతుల భాగం పూర్తిగా ధ్వంసమైంది. 1883వ సంవత్సరంలో నిర్మించిన ఈ టౌన్‌హాల్‌ను.. ఫ్రాన్స్ ప్రభుత్వం 1975లో చరిత్రాత్మక కట్టడంగా గుర్తించింది. నిరసనకారులు ఉద్దేశపూర్వకంగానే ఈ చారిత్రక కట్టడానికి నిప్పంటించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులు, వ్యాపార కేంద్రాలు, చరిత్రాత్మక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లో ఉన్న ఇతర చరిత్రాత్మక కట్టడాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.


చర్యలు తీసుకుంటాం: ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్

ఈ ఘటనపై ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తులపై, చారిత్రక కట్టడాలపై దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు. ప్రజలకు నిరసనలు తెలిపే హక్కు ఉంటుంది కానీ.. హింసాత్మక చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా.. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆర్థిక సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ యువత ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని చోట్లలో ఈ నిరసనలు శాంతియుత మార్గంలో కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్లలో హింసాత్మకంగా మారుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అలా అనుండాల్సింది కాదు.. ‘నిర్బంధ సేవకుల’ కామెంట్స్‌పై వాన్స్ వివరణ

అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు

Updated Date - Oct 18 , 2026 | 09:19 PM