‘ఇన్‌స్టాగ్రాం ఫిమేల్ యాప్’ కామెంట్‌పై మస్క్ స్పందన
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:10 PM
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్‌కు తెరలేపాయి. ఓ యూజర్ చేసిన కామెంట్‌కు ఆయన ఇచ్చిన రిప్లైయే దీనికి కారణం. ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువగా మహిళలే పోస్టులు పెడుతున్నారని, అది ఫీమేల్ యాప్ అని జీజర్ క్యాపిటర్ అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. ఆ ఫీమేల్ యాప్‌ను డిలీట్ చేశానని ఆయన చెప్పారు. ఆయన కామెంట్‌కు మస్క్ స్పందిస్తూ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్‌కు తెరలేపాయి. ఓ యూజర్ చేసిన కామెంట్‌కు ఆయన ఇచ్చిన రిప్లైయే దీనికి కారణం. ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువగా మహిళలే పోస్టులు పెడుతున్నారని, అది ఫీమేల్ యాప్ అని జీజర్ క్యాపిటర్ అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. ఆ ఫీమేల్ యాప్‌ను డిలీట్ చేశానని ఆయన చెప్పారు. ఆయన కామెంట్‌కు మస్క్ స్పందిస్తూ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు.
‘అవును, ఇన్‌స్టాగ్రాం ఉన్నది గర్ల్స్ కోసమే’ అని మస్క్ రిప్లై ఇచ్చారు. దీంతో మస్క్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి డిబేట్‌కు తెరతీసింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ మస్క్ కామెంట్‌కు జవాబు చెప్పారు. ‘ఇన్‌స్టాగ్రాం గర్ల్స్‌ది అయితే, ఎక్స్ ఎవరిది? ఎక్స్ పురుషులదా? దానిని పురుషుల యాప్‌గా అర్థం చేసుకోవచ్చా’ అని ఓ యూజర్ ప్రశ్నించారు. మరో యూజర్ స్పందిస్తూ ఎక్స్ గురించి పలు ప్రశ్నలు అడిగారు. ‘ఇన్‌స్టాగ్రాం యాప్ ఒక్క మహిళల కోసమే అని నేను ఒప్పుకోను. అన్ని జెండర్ల కోసమూ ఆ యాప్ ఉంది. అన్ని జెండర్ల వారు ఆ యాప్ వాడుతున్నారు’ అని మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇన్‌స్టాగ్రాం అందరి కోసం అని మరో నెటిజన్ జవాబు ఇచ్చారు.
ఇంతకుముందు కూడా అదే రీతిలో కామెంట్
ఇన్‌స్టాగ్రాం గురించి ఎలాన్ మస్క్ ఆవిధంగా కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్‌లైన్ ట్రెండ్ల గురించి ఒక వైరల్ త్రెడ్‌కు జవాబు ఇస్తూ ఈ ఏడాది మే నెలలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ జీవితంలోని వివిధ దశల గురించి ప్రజల ఆన్‌లైన్ అలవాట్లు ఎలా ప్రతిఫలిస్తాయన్న చర్చపై మస్క్ స్పందించారు. తనతో ఇన్‌స్టాగ్రాం ప్రొఫైళ్లను షేర్ చేసే పురుషులను ఆయన అప్పుడు ఎద్దేవా చేశారు. ‘పురుషులు నాకు వారి ఇన్‌స్టా్గ్రాం పోస్టులు పంపుతూ ఉంటారు. పురుషులు మార్పు చెందుతున్నారా అని వారి ప్రొఫైల్స్ చూస్తే నాకు అనిపిస్తుంది’ అని మస్క్ పేర్కొన్నారు. దీంతో ఆయన కామెంట్లు వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారి తీశాయి. మస్క్ వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని పలువురు యూజర్లు విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..