ఫ్లైదుబాయ్ విమానం దారి మల్లింపు.. లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:23 AM
దుబాయ్ నుంచి నేపాల్‌లోని పోఖరాకు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని లక్నోకు మళ్లించారు. దీంతో విమానం లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానంలో ల్యాండ్ అయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: దుబాయ్ నుంచి నేపాల్‌లోని పోఖరాకు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని లక్నోకు మళ్లించారు. దీంతో విమానం లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానంలో ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్‌జడ్ 1165 బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం శనివారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేపాల్‌లోని పోఖరాకు బయల్దేరింది.
అయితే, మార్గం మధ్యలో పోఖరాలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఫ్లైట్ అక్కడ ల్యాండ్ కావడం సురక్షితం కాదని భావించి విమానాన్ని లక్నోకు మళ్లించారు. దీంతో విమానం లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో సాయంత్రం 6.53 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ఫ్లైట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏ6-ఎఫ్ఎంయూ అని చెప్పారు. విమానం లక్నో విమానాశ్రయంలో దిగిన తర్వాత రాత్రి 8.08 గంటలకు మళ్లీ పోఖరాకు బయల్దేరిందని వెల్లడించారు.
ప్రతికూల వాతావరణం వల్లే విమానాన్ని లక్నోకు మళ్లించారని, అంతేతప్ప విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని, అలాగే ఎలాంటి ఎవర్జెన్సీ కూడా రాలేదని వివరించారు. విమానాన్ని బోయింగ్ సంస్థ నిర్వహిస్తోందని చెప్పారు. కాగా.. గత నెల 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై కోపైలట్ హమామ్ అల్ హమామీ గొడ్డలితో దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్
కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి