బంగ్లాదేశ్‌లో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. భారతీయ పేషెంట్ మృతి
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:23 PM
కోల్‌కతాకు వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్‌ను సాంకేతిక లోపం కారణంగా విమాన సిబ్బంది బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న భారతీయ పేషెంట్ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాకు వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్‌ను సాంకేతిక లోపం కారణంగా విమాన సిబ్బంది బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న భారతీయ పేషెంట్ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం మృతి చెందారు. అంజనా భౌమిక్ అనే 56 ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను అగర్తల నుంచి కోల్‌కతా తీసుకువెళ్లాలని భావించిన వైద్యులు ఎయిర్ అంబులెన్స్‌లో బయలుదేరారు. ఈ ప్రయాణం మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన తలుపు పాక్షికంగా తెరుచుకుంది. దీంతో ఎయిర్ అంబులెన్స్‌ను సిబ్బంది బంగ్లాదేశ్‌లో అత్యవసరంగా దించారు.
ల్యాండింగ్ అనంతరం అంజనా భౌమిక్‌ను బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. కాగా అంజన మృతి వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మరణించడానికి, అత్యవసర ల్యాండింగ్‌కు సంబంధముందా.. అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి లేనప్పటికీ బంగ్లాదేశ్ అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి భారతీయ విమానాన్ని అనుమతించారని బంగ్లా వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ఈ వార్తలూ చదవండి
‘ఎవరినీ వదిలిపెట్టం’.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ వార్నింగ్
టైగర్ ష్రాఫ్ కాల్పుల ఘటనతో వెలుగులోకి అనిల్ పండిట్ పేరు.. ఇంతకీ అతడెవరు?