విమానాశ్రయ టెర్మినల్‌లోకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:54 AM
డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం అనర్థాలకు దారి తీస్తుందని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. విమానాశ్రయంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(America).. మిచిగాన్‌లోని డెట్రాయిట్ మెట్రో పాలిటిన్ వేన్ కౌంటీ విమానాశ్రయం(Airport)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారే విమానాశ్రయంలోని టెర్మినల్‌లోకి కారు దూసుకురావడంతో ప్రయాణికులు(Passengers) భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక మెర్సిడెస్ కారు టెర్మినల్ ఎంట్రెన్స్ గుండా వెళ్లి డెల్టా చెక్-ఇన్ డెస్క్ సమీపంలో ఉన్న టికెట్ కౌంటర్‌లోకి దూసుకువెళ్లిందని అధికారులు తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియో ఫుటేజ్‌లో లోపల అద్దాలు పగిలిపోయి గందరగోళంగా ఉంది. డ్రైవర్ డెట్రాయిట్ లయన్స్ జెర్సీ ధరించి, గట్టిగా అరుస్తున్నట్లు కనిపిస్తుంది. టీఎస్ఏ సిబ్బంది, విమానాశ్రయ భద్రతా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ ఆరుగురిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్