బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు రన్‌ఆఫ్‌కు.. ఫ్లావియో బొల్సొనారోకు ఆధిక్యం, లులాతో హోరాహోరీ
ABN , Publish Date - Oct 05 , 2026 | 08:00 AM
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల తొలి విడతలో ఉత్కంఠ కొనసాగింది. ఏ అభ్యర్థికీ 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో అక్టోబర్ 25న రన్‌ఆఫ్ జరగనుంది. ఫ్లావియో బొల్సొనారో, లులా డా సిల్వా మధ్య తుది పోటీ నెలకొంది.
Brazil Presidential Election Runoff: బ్రెజిల్ దేశాధ్యక్ష ఎన్నికల తొలి విడత ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ అభ్యర్థికి గెలుపునకు కావలసిన 50 శాతానికి పైగా (Majority)ఓట్లు రాకపోవడంతో, అధ్యక్ష పీఠం కోసం అక్టోబర్ 25న 'రన్ ఆఫ్' (Runoff - రెండో విడత పోలింగ్) జరగనున్నట్లు దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.
తొలి విడత ఓట్ల లెక్కింపులో మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కుమారుడు, లిబరల్ పార్టీ నాయకుడు ఫ్లావియో బొల్సొనారో (Flavio Bolsonaro) దాదాపు 47.45 శాతం ఓట్లతో ముందంజలో నిలవగా, ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (Lula da Silva) 44.66 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
రన్ ఆఫ్ తేదీ: అక్టోబర్ 25, 2026 న రెండో విడత పోలింగ్ జరగనుంది. విజేతగా నిలిచే కొత్త అధ్యక్షుడు జనవరి 5, 2027న బాధ్యతలు స్వీకరిస్తారు. సర్వేలు మొదట్లో లులా డా సిల్వాకు స్వల్ప ఆధిక్యం ఉంటాయని అంచనా వేసినప్పటికీ, ఫ్లావియో బొల్సొనారో అనూహ్యంగా పుంజుకుని ఆధిక్యం సాధించారు.
బ్రెజిల్‌లో పెరిగిపోతున్న నేరాలు, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, అవినీతి అంశాలు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారాయి.
ఫ్లావియో బొల్సొనారో (45): నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటానని, పన్నుల భారాన్ని తగ్గిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెరుగైన సంబంధాలు నెరుపుతానని ప్రకటించారు. ఇతని తండ్రి, మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో 2022 ఎన్నికల ఓటమి అనంతరం కుట్రకు పాల్పడినందుకు 27 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

లులా డా సిల్వా (80): నాలుగోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న లులా, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ పథకాలే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 25న జరగబోయే రన్ ఆఫ్ పోలింగ్ బ్రెజిల్ భవిష్యత్తును నిర్ణయించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధ విరమణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి
రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్ ధ్వంసం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..