Share News

ఎయిరిండియా కీలక నిర్ణయం.. దుబాయ్ వెళ్లే విమానాల రద్దు

ABN , Publish Date - Mar 16 , 2026 | 03:24 PM

ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో విమానాశ్రయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.

ఎయిరిండియా కీలక నిర్ణయం.. దుబాయ్ వెళ్లే విమానాల రద్దు
Air India Cancels Flights

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో విమానాశ్రయ పరిసర ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అబుదాబి, రస్ అల్‌ఖైమా, షార్జాలకు విమానాలు యథావిధిగా కొనసాగుతాయని ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.


'దుబాయ్‌లో(Dubai) విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇండియా నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లే అన్ని విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశాం. దుబాయ్‌కు బయలుదేరే ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ఈరోజు రద్దయ్యాయి' అని ఎయిరిండియా సంస్థ ఎక్స్ రాసుకొచ్చింది. మరోవైపు తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం కూడా ఆగింది. TRV-DXB విమానం353 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఇవాళ ఉదయం 4:40 గంటలకు బయలుదేరి.. దుబాయ్ ఎయిర్ పోర్టు మూసివేయడంతో ఉదయం 8:40 గంటలకు తిరిగి వచ్చింది. అలానే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన మరో ఎమిరేట్స్ విమానం EK533 కూడా వెనక్కి వచ్చేసింది.


ఇవి కూడా చదవండి:

యుద్ధ నౌకల కోసం ట్రంప్ అభ్యర్థన.. తిరస్కరించిన మిత్ర దేశాలు

ఇరాన్ దాడులు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు బ్రేక్

Updated Date - Mar 16 , 2026 | 03:59 PM