అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:27 PM
తొలి ముస్లిం సెనెటర్‌గా నిలిచి అబ్దుల్ ఎల్ సయీద్ చరిత్ర సృష్టించారు. అయితే ఈ విజయం తరువాత ఒక్కసారిగా కర్ణాటకలోని ఓ చిన్న పల్లెటూరు ట్రెండింగ్‌లో వచ్చింది. ఎందుకంటారా..?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిచిగన్ రాష్ట్రం నుంచి బరిలో దిగిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయీద్ ఘన విజయం సాధించారు. తొలి ముస్లిం సెనెటర్‌గా నిలిచి ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ విజయం తరువాత ఒక్కసారిగా కర్ణాటకలోని ఓ చిన్న పల్లెటూరు ట్రెండింగ్‌లో వచ్చింది. ఎందుకంటారా..? ఆ గ్రామంతో అబ్దుల్ భార్య డాక్టర్ సారా జుకాకు ప్రత్యక్ష సంబంధముంది కాబట్టి. గతంలో ఆమె కుటుంబం మైసూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భత్కల్ అనే ఊరిలో నివసించేది. సారా తండ్రి జుకాకు తయ్యబ్ చిన్నతనం అదే గ్రామంలో గడిచింది. తరవాత ఆయన ఎమ్.బి.బి.ఎస్ పూర్తి చేసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ నెఫ్రాలజిస్ట్‌గా సేవలందిస్తూ స్థిరపడిపోయారు.
కొంతకాలానికి యూఎస్‌లోని మిచిగన్ రాష్ట్రంలో జుకాక్ తయ్యబ్‌కు సారా జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు వైద్యరంగం పట్ల ఆసక్తి ఉంది. అందుకే కొలంబియా వర్సిటీలో డాక్టర్ పట్టా అందుకున్నారు. తరువాత మిచిగన్ యూనివర్సిటీలో సైకియాట్రిస్ట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలోనే అబ్దుల్‌ను సారా తొలిసారి చూశారు. అక్కడ వీరి పరిచయం ప్రేమగా మారి 2006లో పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది.
కాగా మిచిగన్ రాష్ట్రం నుంచి బరిలో దిగిన అబ్దుల్ కోసం సారా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తొలి ముస్లిం సెనెటర్‌గా అబ్దుల్ నిలిచిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ రాజర్స్‌పై ఆయన రెండు లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంపై ఎక్స్ వేదికగా స్పందించి, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలూ చదవండి
మిడ్‌టర్మ్ ఎన్నికల సర్‌ప్రైజ్.. యూఎస్‌లో తొలి ముస్లిం సెనెటర్
ముస్లిం సెనెటర్ తొలి ప్రసంగం.. వాన్స్, ట్రంప్‌పై పంచ్‌లు