Share News

విటమిన్ ‘ఏ’ లోపానికి చెక్ పెట్టే అద్భుత చిట్కాలు!

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:08 AM

మన శరీరానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ‘ఏ’ ఒకటి. కంటి చూపు మెరుగుపడాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ విటమిన్ ఎంతోొ అవసరం. విటమిన్ ఏ సమృద్ధిగా లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం..

విటమిన్ ‘ఏ’ లోపానికి చెక్ పెట్టే అద్భుత చిట్కాలు!
Immunity Boosting Food

ఇంటర్నెట్ డెస్క్: మన శరీరానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ‘ఎ’ ఒకటి. కంటి చూపు మెరుగుపడాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ విటమిన్ ఎంతో అవసరం. విటమిన్ ఎ సమృద్ధిగా లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం..

విటమిన్ ఎ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం కారణంగా శరీరంలో కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ఏ విటమిన్ లోపంతో బాధపడే వారికి వంటింట్లోనే చక్కటి పరిష్కాలు ఉన్నాయి.


విటమిన్-ఎ లోపిస్తే వచ్చే సమస్యలు:

  • విటమిన్-ఎ లోపిస్తే రేచీకటి సమస్య వస్తుంది. రాత్రి సమయంలో దృష్టి సరిగా లేకపోవడం, కళ్ళు పొడిగా మారడం రేచీకటిలో ప్రధాన సమస్యలు. కంటిలోని తెల్లపొర పొడిబారినట్లుగా ఉంటుంది.

  • చర్మం గరుకుగా, పొడిగా మారడం, దురద, జుట్టు పల్చబడటం, గోర్లు పెళుసుగా మారడం. చర్మం చికాకులు, చర్మం వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి.

  • విటమిన్-ఎ లోపం ఉండేవారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. చాలా తొందరగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఏ పని చేయకపోయినా అలసటగా అనిపించడం దీని లక్షణమే. తరచుగా గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు, కడుపు సంబంధిత సమస్యలు వస్తుంటాయి.

  • చిన్న చిన్న గాయాలు లేదా మొటిమలు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. పిల్లలలో పెరుగుదల మందగిస్తుంది.


తీసుకోవాల్సిన ఆహారం:

  • తోటకూర, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆకుకూరల్లో ఎ, సి, ఇ, కె విటమిన్లు, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

  • క్యారెట్, తీపి గుమ్మడికాయ, చిలకడదుంపలో బీటా-కెరొటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ‘ఎ’గా మారుతుంది.

  • పండిన మామిడి పండు, బొప్పాయి, దోసకాయ వంటి పండ్లు తీసుకోవాలి.

  • గుడ్డులోని సొన, పాలు, పెరుగు, వెన్న, చేపల ద్వారా విటమిన్ ‘ఎ’ నేరుగా అందుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 15 , 2026 | 01:59 PM