బియ్యపు పిండిలో ఈ రెండూ కలిపి రాసుకుంటే.. మీ చర్మం నిగనిగలాడాల్సిందే..!
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:40 AM
వంటగదిలో ఉన్న ఈ రహస్యంతో కొరియన్ మహిళల లాంటి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అదేంటో మీకు తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి మచ్చలు లేకుండా కాంతిలా మెరిసే చర్మాన్ని అందరూ కోరుకుంటారు. కొందరు చర్మ సౌందర్యం కోసం తరచూ పార్లర్లకు వెళ్లి ఖరీదైన ఫేషియల్స్, చర్మ చికిత్సలు, రసాయన ఆధారిత ఉత్పత్తులపై వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తారు. కానీ వంటగదిలో ఉన్న ఈ రహస్యంతో కొరియన్ మహిళల లాంటి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అదేంటో మీకు తెలుసా..?
వంటగదిలోని బియ్యపు పిండి మీ ముఖాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంటే మీరు నమ్ముతారా..? బియ్యపు పిండిలో కొంచెం తేనె, ఇంకొంచెం పాలు కలిపి ముఖానికి రాసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఈ మిశ్రమం మొండి టానింగ్ మచ్చలను, చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఎలా చేయాలో సవివరంగా తెలుసుకుందామా.!
కావాల్సినవి ఇవి..
మెత్తగా రుబ్బిన రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి
రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు
1 టీస్పూన్ స్వచ్ఛమైన తేనె
1/2 టీస్పూన్ రోజ్ వాటర్ (ఆప్షనల్)
చేయాల్సినది ఇలా..
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి తీసుకోండి. దానికి పచ్చి పాలు, తేనె కలపండి. ఈ మిశ్రమం చిక్కటి పేస్ట్‌లా అయ్యే వరకు బాగా మిక్స్ చేయండి. అంతే ఫేస్ ప్యాక్ రెడీ. దీన్ని వాడే ముందు ముఖాన్ని రోజ్ వాటర్‌తో లేదా మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖంపై అప్లై చేసుకోవాలి. ఇందులోని పోషకాలు చర్మానికి అందాలంటే దీనిని 20 నిమిషాల పాటు ముఖంపైనే ఉంచుకోవాలి. ప్యాక్ కొద్దిగా ఆరిన తరువాత స్వచ్ఛమైన నీటితో కడగాలి. ఈ చిట్కా చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ వార్తలూ చదవండి
మొటిమలతో విసిగిపోయారా..? వేప నీటితో ఇలా చేస్తే..
నిద్రపోయే ముందు రెండు యాలకులు నమిలితే ఇన్ని ప్రయోజనాలా..?