Share News

నిద్రపోయే ముందు రెండు యాలకులు నమిలితే ఇన్ని ప్రయోజనాలా..?

ABN , Publish Date - Oct 17 , 2026 | 07:17 AM

రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను నమిలితే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దామా..?

నిద్రపోయే ముందు రెండు యాలకులు నమిలితే ఇన్ని ప్రయోజనాలా..?
Cardamom Benefits

ఇంటర్నెట్ డెస్క్: చాలామంది యాలకులను కేవలం మసాలా దినుసులుగా పరిగణిస్తారు. అయితే యాలకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ మాట ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లే చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు వీటిని నమలడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


మెరుగైన జీర్ణక్రియ: రాత్రిపూట చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. పడుకునే ముందు ఒకటీ రెండూ యాలకులు నమలడం వల్ల లాలాజలంలో జీర్ణరసం పెరుగుతుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. తద్వారా ఉదయం మలబద్ధకం, గుండెల్లో మంట లాంటి సమస్యలు తగ్గుతాయి.

నిద్రలేమికి చెక్: యాలకులలోని సహజ సుగంధ సమ్మేళనాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. అలాగే నిద్రలేమి సమస్యలూ తగ్గుతాయి.

నోటి దుర్వాసన ఇక రాదు: యాలకులలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటీలో బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఉదయం పూట నోటి దుర్వాసన రాకుండా నివారిస్తాయి. దానితోపాటు రాత్రివేళ శ్వాసనాళాల్లో పేరుకుపోయే కఫాన్ని తొలగించి గొంతు నొప్పి, గురక వంటి సమస్యలను తగ్గిస్తాయి.

యాలకులు తీసుకునే విధానం: రాత్రి పడుకునే 20 నుంచి 30 నిమిషాల ముందు ఒకటి లేదా రెండు పచ్చి యాలకులను బాగా నమలాలి. తరువాత గోరువెచ్చని నీటిని తాగాలి. కావాలనుకుంటే యాలకుల పొడిని పాలల్లో మరిగించి కూడా తాగొచ్చు.


ఇవీ చదవండి

బాబోయ్.. ఉసిరి రసం తాగితే ఇన్ని లాభాలా..!

డెంగ్యూతో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయా..? ఈ ఆహారాలు తీసుకోండి..

Updated Date - Oct 17 , 2026 | 07:24 AM