Share News

బాబోయ్.. ఉసిరి రసం తాగితే ఇన్ని లాభాలా..!

ABN , Publish Date - Oct 12 , 2026 | 09:57 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ఉసిరికాయ ప్రయోజనాలను వివరించారు. అందుకే ఈ మధ్యన ఉసిరి రసాన్ని చాలామంది ఇష్టంగా సేవిస్తున్నారు.

బాబోయ్.. ఉసిరి రసం తాగితే ఇన్ని లాభాలా..!
Amla Juice

ఇంటర్నెట్ డెస్క్: సైజులో చిన్నగా ఉన్నా ఉసిరి అందించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీనిలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ఉసిరికాయ ప్రయోజనాలను వివరించారు. అందుకే ఈ మధ్యన ఉసిరి రసాన్ని చాలామంది ఇష్టంగా సేవిస్తున్నారు. ఇలా తాగడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


రోగనిరోధక శక్తి: ఉసిరికాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.

జీర్ణ వ్యవస్థ: ఉసిరి రసం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


జుట్టు ఒత్తుగా, చర్మం ఆరోగ్యంగా: ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తాయి. అంతేకాకుండా ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.

బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకుంటే ఉసిరి ఒక మంచి ఎంపిక. ఇది శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేస్తుంది.


కళ్లకూ మంచిది: ఉసిరి రసం కళ్లకూ మేలు చేస్తుంది. దీనిలో ఉండే కెరోటిన్ దృష్టిని మెరుగుపరుస్తుంది. శుక్లాలు, కంటి ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఉసిరి రసం చేసే విధానం:

ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయండి. వాటిని మిక్సర్‌లో వేసి, తగినంత నీళ్లు పోసి గ్రైండ్ చేయండి. అంతే ఉసిరి రసం రెడీ. ఆ తరువాత దాన్ని వడగట్టి తాగండి. ఈ రసాన్ని 15 రోజుల పాటు పరగడుపున సేవిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


ఈ వార్తలూ చదవండి

మొటిమలతో విసిగిపోయారా..? వేప నీటితో ఇలా చేస్తే..

బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ 4 కూరగాయలు ట్రై చేయండి..

Updated Date - Oct 12 , 2026 | 10:05 AM