Share News

మొదటిరోజు 690 నామినేషన్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:14 AM

రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం శ్రీకారం చుట్టుకుంది. పట్టణ స్థానికసంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ ప్రకటించిన నేపథ్యంలో..

మొదటిరోజు 690 నామినేషన్లు

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం శ్రీకారం చుట్టుకుంది. పట్టణ స్థానికసంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ ప్రకటించిన నేపథ్యంలో, పలుచోట్ల నామినేషన్లు పడ్డాయి. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. మొదటిరోజు పార్టీల అభ్యర్థులు మొత్తం 690 నామినేషన్లు దాఖలు చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలో 6 నామినేషన్లు మేయర్‌ పదవుల కోసం దాఖలయ్యాయి. 274 వార్డు సభ్యుల పదవులను కూడా కలుపుకొంటే... మొత్తం 280 దాఖలయ్యాయి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవుల కోసం 43, వార్డు సభ్యుల కోసం 367... కలిపి మొత్తం 410 నామినేషన్లు ఎన్నికల అధికారులు స్వీకరించారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:14 AM