తాటి బెల్లంతో లభించే ప్రయోజనాలివే!
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:18 AM
తాటి బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో తగినన్ని పోషకాలు, ఖనిజాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తాటి బెల్లాన్ని చాలామంది ఇష్టపడతారు. దీన్ని తినేందుకు ఆసక్తి చూపుతారు. తాటి రసం నుంచి తయారు చేసే ఈ బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో తగినన్ని పోషకాలు, ఖనిజాలు ఉన్నాయని వివరిస్తున్నారు. ఈ బెల్లంలో ఐరాన్ సహా ఇతర పోషకాలు ఉంటాయి. అయితే తయారీ విధానం, నాణ్యత బట్టి వీటి పరిమాణం మారుతూ ఉంటుంది. ఇంతకీ తాటి బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా..
హిమోగ్లోబిన్ ఉత్పత్తి
శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. సాధారణంగా ఐరన్ లోపం వల్లే రక్తహీనత వస్తుంది. తాటి బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అయితే రక్తహీనత నివారించడానికి ఇతర ఆహార పదార్థాలూ అవసరం. తాటి బెల్లంతో పాటు పాలకూర, పప్పుధాన్యాలు, నువ్వులు, నట్స్ లాంటివి తీసుకోవాలి. విటమిన్ సీ అధికంగా ఉంటే ఉసిరి, నారింజ పండ్లను తినడం ద్వారా కూడా ఐరన్ ఎక్కువ పొందొచ్చు.
విటమిన్ బీ1, బీ2
విటమిన్ బీ1 నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ బీ2 శరీర కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ రెండూ తాటి బెల్లంలో దొరుకుతాయి. కొన్నిసార్లు ఈ విటమిన్ల పరిమాణంలో తేడాలు ఉండొచ్చు.
ఎలా వినియోగించాలి?
తాటి బెల్లం పొడిని పాలలో కలిపి తాగొచ్చు. తీపి వంటకాల్లో కూడా ఈ పొడిని వినియోగించవచ్చు. అయితే ఆ తాటి బెల్లంలో సహజంగానే చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్న వారు దీన్ని తక్కువగా తీసుకోవాలి. వైద్యులను సంప్రదించిన తరువాతే వినియోగించడం మరీ మంచిది.
ఇవీ చదవండి
సంప్రదాయం వెనుక సైన్స్.. అరటి ఆకులో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
రోజూ క్యారెట్ తింటే 5 ప్రయోజనాలు.. కంటిచూపు నుంచి చర్మ ఆరోగ్యం వరకు!