Share News

Healthy Food: ఈ ఫుడ్ తింటే బీపీ, షుగర్‌కి చెక్ పెట్టొచ్చు

ABN , Publish Date - Jan 05 , 2026 | 08:09 PM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం కాలంలో మనం తినే ఆహార పదార్థాలు కొత్త రోగాలు తీసుకువస్తున్నాయి. మన ఇంట్లో దొరికే ఫుడ్‌తో బీపీ, షుగర్ రాకుండా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా?

Healthy Food: ఈ ఫుడ్ తింటే బీపీ, షుగర్‌కి చెక్ పెట్టొచ్చు
Control Blood Pressure Naturally

ఇటీవల కాలంలో చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా చాలా మంది డయాబెటిస్ (Diabetes) బారిన పడుతున్నారు. డయాబెటిస్‌కి బీపీ(Blood Pressure) తోడైతే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్ నియంత్రణలో ఉండాలంటే మందులతోపాటు మనం తినే ఆహారం చాలా కీలకం. మన ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్ చేయవొచ్చని నిపుణులు చెబుతున్నారు.


1. రక్తపోటు (BP) కంట్రోల్‌లో ఉండాలంటే శరీరంలో సోడియం తగ్గి, పొటాషియం పెరగాలి. ఇందుకోసం ఆకు కూరలు తింటే చాలా మంచిది

2. పాలకూర‌లో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తనాళాల మీద ఒత్తిడి తగ్గిస్తుంది.

3. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

4. అరటిపండు రోజుకి ఒకటి తినడం వల్ల పొటాషియం సమృద్ధిగా అంది బీపీ అదుపులో ఉంటుంది.

5. బీపీ ఉన్నవాళ్లు ఉప్పు వాడటం చాలా వరకు తగ్గించుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి.


6. నడక శరీరానికి ఎంతో మంచిది. ఇది బీపీనీ చాలా వరకు కంట్రోల్‌లో ఉంచుతుంది. ప్రతిరోజూ అరగంట నడకకు కేటాయిస్తే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది.

7. మెంతులు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించడంలో చాలా పవర్ ఫుల్. వీటిని నీళ్లలో నానబెట్టి తింటే మంచిది.

8. దాల్చిన చెక్క ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, షుగర్ లెవల్స్ పెరగకుండా చూస్తుంది.

9. ఓట్స్, బ్రౌన్ రైస్ ‌లో ఫైబర్ (పీచు పదార్ధం) ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల షుగర్ నెమ్మదిగా రక్తంలోకి విడుదల అవుతుంది.

10. నేరేడు పండ్లు వీటి గింజల పొడి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం లాంటిది.


(Note): ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.)


Also Read:

చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!

Updated Date - Jan 05 , 2026 | 09:09 PM