మఖానా పోషకాల ఖజానా.. లోటస్ సీడ్స్ తింటే వచ్చే ప్రయోజనాలు ఇవే..
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:43 PM
ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని వేర్వేరు పేర్లతో పిలిచే మఖానా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఖనిజాలూ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. పూర్తి కథనం చదవండి
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో పోషకాహారంపై అవగాహన బాగా పెరిగింది. ఆరోగ్యకరమైన, పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారానికే అందరూ ఓటు వేస్తున్నారు. శరీరానికి మేలు చేసే పదార్థాలను తినేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మఖానా గింజలను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలకే ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని వేర్వేరు పేర్లు ఉన్నాయి. సాధారణంగా మఖానాలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఖనిజాలూ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఈ లోటస్ సీడ్స్‌తో లభించే లాభాలేంటో చూద్దామా మరి.
బీపీ అదుపులో..
మఖానాలో మెగ్నీషియం లాంటి అనేక ఖనిజాలు ఉంటాయి. కండరాలు, రక్తనాళాల పనితీరుకు ఈ మెగ్నీషియం ఎంతో అవసరం. ఇది రక్తపోటును నియంత్రించడంలోనూ పాత్ర పోషిస్తుంది. లోటస్ సీడ్స్ తింటే బీపీ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అయితే కేవలం మఖానా గింజల ద్వారా బీపీ పూర్తి అదుపులోకి వస్తుందని, మందులతో ఇక పని ఉండదని భావించడం తగదు.
కాలేయం ఆరోగ్యంగా..
శరీరంలోని హానికర పదార్థాలను శుద్ధి చేసి, తొలగించే పని కాలేయం చూసుకుంటుంది. ఈ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కావాలి. ఇవి మఖానాలో దొరుకుతాయి. కాబట్టి లోటస్ సీడ్స్ తినడం వల్ల కాలేయానికి మేలు జరుగుతుందన్న మాట.
రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా..
మఖానా గింజలు తింటే రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. వీటిలోని పోషక గుణాలు ఈ వ్యవస్థ సాధారణంగా పనిచేసేందుకు సహకరిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ గింజలతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం అవసరమని గుర్తుంచుకోవాలి.
ఇతర ప్రయోజనాలు..
కండరాల పెరుగుదలకు మఖానా సహాయపడుతుంది. కణజాల మరమ్మతుల్లోనూ పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడేందుకు లోటస్ సీడ్స్లోని యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. ఫాక్స్ నట్స్‌లో కొవ్వు పదార్థాలు తక్కువ. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవడం శత విధాలా మంచిది
గమనిక: ఇంటర్నెట్లోని సమాచారం ఆధారంగా ఈ కథనం రూపొందింది. ఇందులోని విషయాలను ‘ఆంధ్రజ్యోతి’ ధ్రువీకరించడం లేదు.
ఇవీ చదవండి
చలికాలంలో సత్తు లడ్డు తిన్నడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
తాటి బెల్లంతో లభించే ప్రయోజనాలివే!