Share News

తింటే కివీ.. ప్రయోజనాలు ఇవి.. చిన్న పండులో ఇన్ని పోషకాలా..!

ABN , Publish Date - Oct 29 , 2026 | 08:15 PM

చూడటానికి చిన్నగా, రుచిలో కొద్దిగా పుల్లగా ఉండే కివీ పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అవేంటంటే..?

తింటే కివీ.. ప్రయోజనాలు ఇవి.. చిన్న పండులో ఇన్ని పోషకాలా..!

ఇంటర్నెట్ డెస్క్: చూడటానికి చిన్నగా, రుచిలో కొద్దిగా పుల్లగా ఉండే కివీ పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. విటమిన్ సీ, విటమిన్ కే, విటమిన్ ఈ, పీచు పదార్థాలు, పొటాషియం వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే సమతుల్య ఆహారంలో కివీని చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు నుంచి జీర్ణక్రియ వరకు పలు అంశాల్లో కివీ ప్రయోజనాలందిస్తుందని వివరిస్తున్నారు.


రోగనిరోధక శక్తి

కివీలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా కాపాడే ప్రక్రియలోనూ కివీ పాత్ర పోషిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఈ పండు ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియకు మేలు

కివీలోని పీచు పదార్థాలు పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మలబద్ధకం సమస్యను తగ్గించడానికి దోహదపడతాయి. క్రమం తప్పకుండా మలవిసర్జన జరగడానికి కూడా సహాయపడవచ్చు. అయితే జీర్ణ సంబంధిత సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.


గుండె ఆరోగ్యానికి..

కివీలోని పొటాషియం రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది. ఇందులోని పీచు పదార్థాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు, అధిక పీచు కారణంగా బరువు తగ్గాలని ఆరాటపడుతున్న వారికీ ఈ పండు మంచి ఫలితాలను ఇస్తుంది.

ఇన్ని ప్రయోజనాలందించే కివీని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే ఏ ఒక్క పండూ అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కాదు. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.


ఇవీ చదవండి

ఆరోగ్యానికి పైనా‘పిల్’.. ఈ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..

చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Updated Date - Oct 29 , 2026 | 08:19 PM