Best Fruits for Heart Health: ఈ పండ్లు తింటే చాలు.. గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:32 AM
ఇటీవల దేశంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిసారి డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, కొన్ని రకాల పండ్లు తింటే రక్తనాళాల పనితీరు మెరుగుపరిచి గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని రకాల పండ్లు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండ్లు తింటే రక్తపోటును తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడం సహా రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. పండ్లతో పాటు ఆకు కూరలు, గింజలు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆపిల్: రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అని అంటారు. గుండె విషయంలో అది అక్షర సత్యం. ఆపిల్‌లో పెక్టిన్ (Pectin) అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
దానిమ్మ: ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో కొవ్వు పలకలు (Plaque) పేరుకుపోకుండా చూస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి, ధమనులు గట్టిపడకుండా కాపాడుతాయి.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ: ఈ పండ్లలో ఆంథోసైనినస్ ఉంటాయి.. ఇవి రక్తనాళాల వాపు (Inflammation)ను తగ్గించి, గుండె ప్రమాదాలు రాకుండా నివారిస్తాయి.
చెర్రీస్: పుల్లని చెర్రీ, తియ్యని చెర్రీ పండ్లు ఎవైనా తినడానికి చాలా డెలీషియస్ గా ఉంటాయి. ఇందులో రిచ్ అంతోసియానైన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అందువల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.
టమాట: ఇందులో ఎక్కువా లైకోపీన్ ఉంటుంది. వారంలో ఐదుసార్ల కంటే ఎక్కువసార్లు తిన్నవారికి గుండె సమస్యలు 26 శాతం తగ్గిందని ఇటీవల జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. టమాటలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
నారింజ-నిమ్మ: వీటిలో విటమిన్ - సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్త నాళాల దృడత్వాన్ని పెంచి, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
అవకాడో: ఇందులో ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి.
రాస్‌బెర్రీస్: ఈ పండ్లు యాంటీఆక్సిండెట్లు, ఫైబర్‌తో నిండి ఉంటాయి, గుండె ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులను నివారిస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News