Share News

ఈ ఆహారం తీసుకుంటే గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:54 PM

మన శరీరంలోని ముఖ్యమైన భాగం ఏదీ అంటే గుండె అని చెబుతారు. ఇది చాలా సున్నితమైన అవయవం.. అందుకే ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. గుండెకు మేలు చేసే ఆహార పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం.

ఈ ఆహారం తీసుకుంటే గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Heart Health Foods

ఇంటర్నెట్ డెస్క్: మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, ఫిట్ గా ఉండటానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన ఆహారం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుండె జబ్బులను తగ్గించి, రక్త ప్రసరణ మెరుగుపరుచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం.


1.ఆకు కూరలు, కూరగాయలు:

తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని విటమిన్ K రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. క్రూసిఫెరస్ కూరగాయలు అంటే బ్రోకలీ, కాలిఫ్లవర్ లలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

2. తృణధాన్యాలు:

ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమలు, రాగులు వంటి తృణధాన్యాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి తోడ్పడుతుంది.

3. నట్స్, విత్తనాలు :

వాల్ నట్స్‌లో మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. బాదం పప్పులో గుండెకు మేలు చేసే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. అవిసె గింజలు(ఫ్లాక్స్ సీడ్) ల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పిస్తా వంటి వాటిని చేర్చుకోండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


4. వెల్లుల్లి, అల్లం:

వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే సమ్మేళనం రక్తపోటును తగ్గించడానికి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూడటానికి సహాయపడుతుంది.

5. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్.. ఆలివ్ పండ్ల నుండి తీసే ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన వంట నూనె. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

6. చేపలు :

సాల్మన్, మెకరెల్ చేపల్లో ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ డి, అయోడిన్, జింక్, సెలీనియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

7. పండ్లు :

పండ్లలో ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్ మెదడు, గుండె ఆరోగ్యానికి, వాస్కులర్ ఫంక్షన్‌కు మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు విటమిన్ సి, కాల్షియం, పొటాషియంను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అవకాడో ఇది గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. నిమ్మ, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 02 , 2026 | 05:27 PM