Share News

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లను దూరం చేసే వెల్లుల్లి..

ABN , Publish Date - Sep 13 , 2026 | 10:22 AM

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని ఓ చిన్న వెల్లుల్లి దూరం చేయగలదా? రక్తనాళ వ్యవస్థను అది బలోపేతం చేస్తుందా.? పూర్తి కథనం మీకోసం..

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లను దూరం చేసే వెల్లుల్లి..
Raw garlic

ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి మానవళికి శాపంగా మారాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. అయితే ఒక చిట్కాతో స్ట్రోక్ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎలాంటి బ్రహ్మ పదార్థాలు అక్కర్లేదని, నిత్యం వంటింట్లో కనిపించే వెల్లుల్లితోనే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తున్నారు.


మెదడులో ఏదైనా భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. అలాగే మెదడులోని రక్తనాళం పగిలినప్పుడూ ఇది సంభవిస్తుంది. దీనివల్ల మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. ఫలితంగా ఆ కణాలు చనిపోతాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో ఈ స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వెల్లుల్లిలోని ఔషధ గుణాలు బాగా ఉపయోగపడతాయని వివరిస్తున్నారు.

వెల్లుల్లిని నమిలినప్పుడు శరీరంలో అల్లిసిన్ అనే సల్ఫర్ ఆధారిత సమ్మేళనం విడుదలవుతుంది. ఇది రక్తనాళ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బ్లడ్ వెసల్స్‌ను ఓపెన్ చేయడంలోనూ అల్లిసిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.


రక్తపోటు: రక్తపోటు కారణంగా కలిగిన అధిక ఒత్తిడితో రక్తనాళాలు బలహీనపడతాయి. అయితే వెల్లుల్లి ఈ రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తం గడ్డకట్టడం: రక్త కణాలు గడ్డకట్టడం వల్ల ఎక్కువగా స్టోక్స్ సంభవిస్తున్నాయి. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు నేచురల్ బ్లడ్ థిన్నర్‌లాగా పనిచేసి, రక్తం గడ్డకట్టుకోవడాన్ని అడ్డుకుంటాయని కొన్ని పరిశోధనలు తెలిపాయి.

కొలెస్ట్రాల్: రక్తనాళంలో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోయి ధమని గోడలు ఇరుకుగా మారుతాయి. అప్పుడు రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ వెల్లుల్లి ఉపయోగపడుతుంది.


ఇలా తినాలి..

మొదట వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేయాలి. వెంటనే వాటిని తినకుండా ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆగాలి. ఆ తరువాత ముక్కలను ఒక్కొక్కటిగా తినాలి. పచ్చి వెల్లుల్లిని తినడమే అన్ని విధాల మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఘాటుగా ఉండదని వంటలోని వెల్లుల్లి ముక్కలను మాత్రమే కొందరు తింటున్నారు. కానీ అధిక వేడి వల్ల ఈ రకం వెల్లుల్లిలో అల్లిసిన్ తగ్గిపోవడానికి అవకాశాలున్నాయి. అందుకే పచ్చి వెల్లుల్లినే వినియోగించడం అన్ని రకాలా మంచిదని నిపుణుల అభిప్రాయం.


ఈ వార్తలు కూడా చదవండి:

మెదడు చురుగ్గా ఉండాలంటే ఈ 10 అలవాట్లు పాటించండి.!

రోజూ 60 సెకన్ల ప్లాంక్‌తో బీపీ తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Updated Date - Sep 13 , 2026 | 12:02 PM