Gandhi Hospital: కిటకిటలాడుతున్న ‘గాంధీ’..
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:51 AM
నగరంలోని గాంధీ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఎన్నడూ లేనంతగా ఒకటేసారి భారీగా రోగులు పెరిగారు. కాగా.. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలను వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో గాంధీకి రోగులు క్యూ కడుతున్నారు.
- భారీగా పెరిగిన రోగులు
- వాతావరణ మార్పులతో పెరుగుతున్న క్యూ
హైదరాబాద్: వాతావరణ మార్పులతో జనానికి సుస్తీ చేస్తోంది. గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) రోగులతో కిటకిటలాడుతోంది. డిమాండ్‌కు తగ్గట్లుగా ఐసీయూ, అత్యవసర విభాగాలు, క్యాజువాలిటీ వార్డుల్లో బెర్తులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. రాత్రి ఏడు గంటల నుంచి మధ్యరాత్రి 3 గంటల వరకు ఆస్పత్రి క్యాజువాలిటీ వార్డుల ముందు అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి.
వెంటిలేటర్ కోసమే..
రాత్రి ఏడు గంటల నుంచి తెల్లావారుజామున వరకు వివిధ జిల్లాల నుంచి అంబులెన్స్‌లో రోగులు గాంధీకి తరలివస్తున్నారు. వారిలో చాలా మంది వెంటిలేటర్ కోసమే ఇక్కడకు వస్తున్నారు. ఐసీయూ, ఏఎంసీ వార్డుల్లో మంచాలు లేకపోవడంతో క్యాజువాలిటీ వార్డు బయట అంబులెన్స్‌లోనే రోగులు వెంటిలేటర్‌పై ఉంటున్నారు. వెంటిలేటర్ కోసం దాదాపు రోజూ 50 నుంచి 60 మంది వరకు వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. చివరి దశ వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉండి వెంటిలేటర్ చికిత్స కోంం రూ.లక్షలు చెల్లించలేని స్థితిలో ఇక్కడకు వస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
వారం రోజుల నుంచి గాంధీకి విపరీతమైన స్థాయిలో రోగుల రద్దీ ఉంటోంది. ఇక్కడ వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. వెంటిలేటర్ కోసం చాలా మంది గాంధీకి వస్తున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రోగులకు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తున్నాం.
- డాక్టర్ వాణి, సూపరింటెండెంట్
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News