కడుపులో మంటా?.. ఇవి తింటే చాలు.. కూల్.!
ABN , Publish Date - Jan 22 , 2026 | 01:20 PM
ఇటీవల చాలా మంది కడుపు మంట, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపులో మంటగా ఉంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అది తగ్గాలంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కడుపులో మంట లేదా గ్యాస్ సమస్యలు వేధిస్తున్నప్పుడు.. మందుల కంటే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్ధాలతో తక్షణమే ఉపశమనం పొందవచ్చు. కడుపులో మంటను చల్లబరిచే ఆ ఆహార పదార్ధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరటి పండు:
ఇందులో యాసిడ్ తక్కువ మోతాదులో ఉంటుంది. సహజమైన 'యాంటాసిడ్'లా పనిచేస్తుంది. అరటిపండ్ల వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పొట్టలో పేగులను పరిశుభ్రంగా ఉంచుతుంది.
2. చల్లని పాలు:
కడుపులో మంటగా ఉన్నపుడు ఒక గ్లాసు చల్లని పాలు చక్కర లేకుండా తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. పాలలోని క్యాల్షియం యాసిడ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది.
3. మజ్జిగ లేదా పెరుగు:
కడుపులో మంటగా అనిపిస్తే వెంటనే మజ్జిగలో కొంచెం వాము లేదా జీలకర్ర పొడి కలుపుకుని తాగితే శరీరం అంతా కూల్‌గా అనిపిస్తుంది. పెరుగులోని ప్రొబయోటిక్స్.. కడుపులోని మంటను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
4. కొబ్బరినీళ్లు:
ఏ సీజన్‌లో అయినా కొబ్బరి నీళ్లు అందుబాటులో ఉంటాయి. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో అవి చక్కగా పనిచేస్తాయి. ఇవి కడుపులో ఉండే పీహెచ్ స్థాయిని సమతుల్యం చేసి మంటను తగ్గిస్తాయి.
5. సోంపు గింజలు:
భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు నమలడం వల్ల గ్యాస్ సమస్యలు రావు. అంతేకాకుండా కడుపులో మంట కూడా తగ్గుతుంది. సోంపును నీళ్లలో మరిగించి ఆ నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
6. కలబంద రసం:
కలబంద రసం జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గిస్తుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
7. బాదంపొడి, బెల్లంపొడి:
కడుపు మంట సమస్యలు దూరం చేయడంలో బెల్లం, బాదం పొడి బాగా పనిచేస్తుంది. గోరు వెచ్చని నీటిలో ఈ రెండింటినీ కలిపి తాగితే కడుపులోని యాసిడ్లను పోగొడుతుంది.
8. హెర్బల్ టీ:
టీ, కాఫీ కన్నా గ్రీన్ టీ, పుదీనా టీ ఆరోగ్యానికి మంచిది. కడుపు ఉబ్బరం లేకుండా, ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News