Share News

పరగడుపున పండ్లు తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:30 PM

పరగడుపున పండ్లు తినొచ్చా? తినకూడదా? తింటే ఏమవుతుంది? చాలామందిలో మెదిలే ప్రశ్న ఇది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవద్దని చెబితే.. మరికొందరు ఖాళీ కడుపుతోనే పండ్లను తినాలని..

పరగడుపున పండ్లు తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

పరగడుపున పండ్లు తినొచ్చా? తినకూడదా? తింటే ఏమవుతుంది? చాలామందిలో మెదిలే ప్రశ్న ఇది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవద్దని చెబితే.. మరికొందరు ఖాళీ కడుపుతోనే పండ్లను తినాలని చెబుతుంటారు. మరి నిజంగా పరగడుపున పండ్లు తినొచ్చా? తింటే ఎలాంటి పండ్లను తినాలి? ఎలాంటి పండ్లను తినకూడదు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం పూట ఖాళీ కడుపుతో పండ్లు తినవచ్చు. అయితే, ఎలాంటి పండ్లు తింటున్నారనేదే ఇక్కడ కీలకం. ఉదయాన్నే పరగడుపున ఆపిల్, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లను తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అరటిపండు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఉదయాన్నే పండ్లు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పండ్లు తేలికగా, సులభంగా జీర్ణమవుతాయి. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పండ్లలో ఉండే పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కడుపు నిండిన భావన కలిగి, పదేపదే తినే అలవాటు తగ్గుతుంది.


ఇది అందరికీ వర్తిస్తుందా?

ఖాళీ కడుపుతో పండ్లు తినడం అందరికీ సరికాదు. అజీర్తి, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పండ్లు తినడం వలన దుష్ప్రభావాలు కలుగుతాయి. ప్రధానంగా నారింజ, అరటిపండ్లు లాంటివి ఉదర సమస్యలకు దారితీస్తాయి. బొప్పాయిని కూడా మితంగా తీసుకోవడం మంచిది.


పండ్లు ఎలా తినాలి..?

ఎప్పుడైనా సరే తాజా పండ్లనే తినాలి. పండ్ల రసాన్ని తాగడం కంటే వాటిని నేరుగా తినడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అయితే, అన్ని రకాల పండ్లను కలిపి ఒకేసారి అధిక పరిమాణంలో తినకూడదు. పండ్లు తిన్న వెంటనే ఆహారం తినడం కూడా మంచిదికాదు.


Also Read:

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం

Updated Date - Apr 12 , 2026 | 05:30 PM