Share News

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:14 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్రెడ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
Alluri District Tragedy

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాడేరు మండలం పెదబయలు పరిధిలోని పర్రెడ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం ప్రకారం, గ్రామానికి సమీపంలోని మత్య గెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లిన కోడా ప్రదీప్ (9), పాంగి శ్రీను (10), జలంగి హర్షిత్ (10) లోతైన ఊబిలో చిక్కుకుని మృతి చెందారు.


దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈత సరదాగా వెళ్లిన పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.


Also Read:

మోస్ట్ వాంటెడ్ అంతర్ రాష్ట్ర ఘరానా హంతకుడు అరెస్ట్

ఆశా భోంస్లే మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాళి

For More Latest News

Updated Date - Apr 12 , 2026 | 05:14 PM