తల్లిదండ్రులకు విషం పెట్టిన కూతురు.. కారణం తెలిసి అందరూ షాక్..
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:05 PM
మధ్య ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో పెళ్లి కోసం ఓ బాలిక ఘాతుకానికి ఒడిగట్టింది. కన్న తల్లిదండ్రులకు ఎలుకల మందు పెట్టి చంపడానికి ప్రయత్నించింది.
భోపాల్, ఏప్రిల్ 12: ప్రియుడితో పెళ్లి కోసం ఓ బాలిక దారుణానికి ఒడిగట్టింది. కన్న తల్లిదండ్రులకు ఎలుకల మందు పెట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మొరేనాకు చెందిన గబ్బర్ ప్రజాపతి, మిథిలేశ్ ప్రజాపతిల కూతురు(మైనర్).. ఘంటేనా ప్రాంతానికి చెందిన రవి కదేరా కుమారుడు సుదేమా ప్రేమించుకున్నారు. ప్రియుడు సుదేమాతో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోరని బాలిక భావించింది. ఈ నేపథ్యంలోనే వారిని చంపాలని ప్రేమికులిద్దరూ నిశ్చయించుకున్నారు.
సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు తినే చపాతీల్లో బాలిక ఎలుకల మందు కలిపింది. ఆ చపాతీలు తిన్న వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత దిగజారటంతో గ్వాలియర్‌కు తీసుకెళ్లారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు సందర్భంగా పోలీసులకు బాలికకు సంబంధించిన ఆడియో క్లిప్ దొరికింది. బాలిక తన ప్రియుడితో మర్డర్ ప్లాన్ గురించి మాట్లాడుతున్న ఆడియో క్లిప్ అది.
అందులో ఏముందంటే.. ‘ఇక్కడికి దగ్గరలో ఫర్టిలైజర్ షాపు ఉంది. అక్కడినుంచి ఓ ప్యాకెట్ ఎలుకల మందు తీసుకురా. ఈ రోజు నేనే చపాతీలు చేస్తున్నా. ఇదే మంచి అవకాశం. నేను వాటిలో ఎలుకల మందు కలిపి వారికి పెడతాను’ అని ఉంది. పోలీసులు బాలికతో పాటు ఆమెకు సహకరించిన ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్
మోస్ట్ వాంటెడ్ అంతర్ రాష్ట్ర ఘరానా హంతకుడు అరెస్ట్