Black Pepper: నల్ల మిరియాలు రోజూ తీసుకుంటే.. ఈ అనారోగ్యాలు చెక్ పెట్టొచ్చు..
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:20 PM
భారతీయ వంట గదిలో కచ్చితంగా నల్ల మిరియాలు ఉండాల్సిందే.. ఎందుకంటే వీటిని ఏ వంటకంలో వేసినా ఘాటైన్ టేస్ట్ ఉంటుంది. జలుబు, రొంప, గొంతు నొప్పితో ఇబ్బంది పడితే వెంటనే మిరియాల కషాయం తాగుతారు. నల్ల మిరియాలతో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో మలబార్ తీరానికి చెందిన మిరియాలు ఎంతో విలువైనవి. అందుకే దీనిని ‘నల్ల బంగారం’ (Black Gold) అని పిలిచేవారు. మిరియాల్లో ఉండే ‘పైపెరిన్’ (Piperine) అనే పదార్థం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మిరియాలలో మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మిరియాల ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
1. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
నల్ల మిరియాలు శరీరంలోని ముఖ్యమైన ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించే శక్తిగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది. మిరియాలు తీసుకోవడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.
2. జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
శీతాకాలంలో చాలా మంది జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారికి మిరియాల ఔషధం గొప్ప వరం అని చెప్పొచ్చు. మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఛాతిలతో పేరుకుపోయిన కఫం కరిగి, శ్వాస తీసుకోవడం సులభమవుతోంది.
3. బరువు తగ్గడానికి సహాయం:
మిరియాల్లో ఉండే పైపెరిన్ శరీరంలోని కొవ్వు కణాలను (Fat cells) విచ్ఛిన్నం చేయడంలో తోడ్పడుతుంది. మెటబాలిజంను వేగవంతం చేసి, నేచురల్ గా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
4. పోషకాలను గ్రహించే శక్తి:
మనం తినే ఆహారంలోని విటమిన్లు (విటమిన్ బి, సి, సెలనియం) ఇతర పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే మిరియాల తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
5. మెదడు పనితీరు మేలు:
మిరియాల్లో ఉండే పైపెరిన్ మెదడు కణాలను చురుగ్గా ఉంచుతుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచడానికి, అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించడానికి సహాయపడుతుంది.
6. యాంటీఆక్సిడెంట్ గుణాలు: నల్లమిరియాలలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. మంటను తగ్గించడం, జీర్ణక్రియ మెరుగుపర్చడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
7. సాధారణంగా టీ లేదా, గ్రీన్ టీలో రెండు మిరియాలు నలిపి వేసుకుంటే గొంతుకు హాయిగా ఉంటుంది. తెలుగు ప్రజలకు మిరియాల చారు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇది జీర్ణక్రియ, జలుబుకు దివ్యౌషధం.
8. నల్లమిరియాలు ఆరోగ్యానికి ఎంత మంచిదైనా.. అతి అనర్థాలకు దారి తీస్తుందన్నట్లు ఎక్కువగా గా తింటే గ్యాస్, కడుపు మంట వంటి సమస్యలు రావచ్చు. మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News