Share News

Best Food for Eyes: ఈ ఫుడ్ తీసుకుంటే.. మీ కంటి చూపు మెరుగుపడటం గ్యారంటీ.!

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:12 PM

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. కళ్లు సరిగా ఉంటే ప్రపంచాన్ని చూడగలం. కంటి సమస్యలు రాకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం. ఏ ఆహారం తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Food for Eyes: ఈ ఫుడ్ తీసుకుంటే.. మీ కంటి చూపు మెరుగుపడటం గ్యారంటీ.!
Foods for Eye Health

ఇంటర్నెట్ డెస్క్: కళ్లు మనిషికి దేవుడిచ్చిన ప్రత్యేక వరం. అందుకే ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అని అంటారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వాడకం, పోషకాహార లోపం వంటివి ప్రధాన కారణాలు. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.


1. ఆకుకూరలు:

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ల్యూటిన్(Lutein), జియాక్సంతిన్(Zeaxanthin) అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి పొరలు దెబ్బతినకుండా కాపాడతాయి.

2. క్యారెట్, చిలగడదుంపలు:

వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన దుంపలు కంటి చూపు, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రేచీకటి రాకుండా రక్షిస్తాయి.

3. సిట్రస్ ఫలాలు:

నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి వంటి పండ్లలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతూ.. శుక్లాలు(Cataracts) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4. బాదాం, వాల్‌నట్స్:

బాదాం, వాల్‌నట్స్‌లో విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వయసుతో పాటు వచ్చే కంటి చూపు లోపాలను అరికడతాయి. ప్రతిరోజూ 4-5 నానబెట్టిన బాదం పప్పులు తింటే చాలా మంచింది.


5. చేపలు:

చేపలలో ట్యూనా, సాల్మన్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కళ్లు పొడిబారడం వంటి సమస్యలను పూర్తిగా తగ్గించి, కంటి నాడిని బలంగా ఉంచుతాయి.

6. గుడ్లు:

గుడ్డులోని పచ్చసొనలో ల్యూటిన్, జియాక్సంతిన్, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి రెటినాను నీలి కాంతి ప్రభావం నుంచి రక్షించడంలో సాయపడతాయి.

7.బెర్రీలు:

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లలో ఉండే ఆంతోసైనిస్(Anthocyanin) అనే యాంటీఆక్సిడెంట్లు కంటి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కళ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి.

8. విత్తనాలు:

గుమ్మడి, అవిసె, సబ్జా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 17 , 2026 | 05:27 PM