Share News

నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: బీజేపీ నేత

ABN , Publish Date - May 04 , 2026 | 10:45 AM

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు.

నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: బీజేపీ నేత
GVL Narasimha rao

న్యూఢిల్లీ, మే04: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార టీఎంసీని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.


న్యూఢిల్లీలో ఆయన విలేకర్లలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 2/3 విజయం సాధించబోతోందన్నారు. అస్సాంలో 3/4 మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు. బెంగాల్లో ప్రజలు 15 ఏళ్లు అధికారం ఇస్తే టీఎంసీ నేతలు అరాచకం సృష్టించారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత, మహిళ భద్రత, మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం, బీజేపీ అభివృద్ధి అజెండా బెంగాల్ ఎన్నికల్లో పని చేశాయని పేర్కొన్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నం ఖాయమన్నారు. ఇక ఇండికూటమి ఉండదని జోస్యం చెప్పారు.


ఈ కూటమి పేరు బెండి కూటమి పెట్టుకోవాలని అందులోని పార్టీల నేతలకు సూచించారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలతో బీజేపీ మరింత బలపడబోతోందని తెలిపారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ ఓటమి తమ విజయమన్నారు. తుది ఫలితాల అనంతరం తమిళనాడులో టీవీకేతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు సాయంత్రం ఒక స్పష్టత వస్తుందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అసోంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. . బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఈ రోజు (సోమవారం) చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాలపై అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో బీజేపీ తన అధిక్యతను చాటుకుంటోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’

For More TG News And Telugu News

Updated Date - May 04 , 2026 | 11:09 AM