ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 04 , 2026 | 10:11 AM
భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, మే 04: భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘ ఆయుష్షుతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన జీవించాలని ఆకాంక్షించారు. అంకితభావంతో దేశానికి ఆయన సేవలు అందించాలన్నారు. దేశ ప్రగతి కోసం ఆయన చేసే ప్రయత్నాలలో మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
నిజాయతీ, స్థిరమైన నాయకత్వంతో పార్లమెంటరీ కార్యకలాపాలను పటిష్ఠ పరిచేందుకు చేసే ప్రయత్నాల్లో ఆయన మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’
For More National News And Telugu News