ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
ABN , Publish Date - Feb 25 , 2026 | 08:24 AM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షలు కావడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల(Intermediate Board Exams) సందడి మొదలైంది. విద్యార్థుల (students) భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షలు కావడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, సరైన ప్రణాళిక, పట్టుదలతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యావేత్తలు (Academics) సూచిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
1. ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్:
పరీక్షలకు ముందు కొత్త అంశాలను అస్సలు చదవకండి. ఇప్పటికే చదివిన అంశాలను రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో తయారు చేసుకున్న నోట్స్ ను తప్పకుండా చూసుకోవాలి.
2. పరీక్షా కేంద్రంలో సమయపాలన:
పరీక్ష కేంద్రంలో హడావిడి పడటం వల్ల చదివిన విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాలి. హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్ వంటివి తప్పకుండా వెంట తీసుకెళ్లాలి.
3. ప్రశ్నాపత్రం:
ఎగ్జామ్ హాల్‌లో ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత మొదటి 10 నిమిషాలు అన్ని ప్రశ్నలు ప్రశాంతంగా చదవాలి. మీకు బాగా తెలిసిన సమాధానాలు ముందుగా రాయడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
4. సమాధాన పత్రం ప్రజెంటేషన్:
ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా కొట్టివేతలు లేకుండా రాయాలి. సైన్స్, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో అవసరమైన చోట డయాగ్రామ్స్ వేయడం వల్ల మంచి ఇంప్రెషన్ పడి ఫుల్ మార్క్స్ పడతాయి.
5. సరైన సమయానికి..
పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రం ఉన్న దూరాన్ని తెలుసుకుని అర్ధగంట ముందే అక్కడికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోండి.
6. వీటిని తీసుకెళ్లవద్దు:
ఎగ్గామ్ హాల్‌లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు సహా ఎలాంటి గాడ్జెట్‌లకు అనుమతి లేదని ఇప్పటికే విద్యార్థులకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి లీగల్ క్లబ్స్
Read Latest Telangana News and National News