Share News

విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి లీగల్‌ క్లబ్స్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:26 AM

కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో లీగల్‌ క్లబ్స్‌ నిర్వహించి విద్యార్థినుల సమస్యలను నమోదు చేసుకుని, కమ్యూనిటీ మహిళా రక్షణకు విద్యార్థులు వలంటీర్లుగా...

విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి లీగల్‌ క్లబ్స్‌

  • ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో లీగల్‌ క్లబ్స్‌ నిర్వహించి విద్యార్థినుల సమస్యలను నమోదు చేసుకుని, కమ్యూనిటీ మహిళా రక్షణకు విద్యార్థులు వలంటీర్లుగా పనిచేసే విధానాన్ని తీసుకువస్తామని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. క్యాంపస్‌ అంబాసిడర్ల కార్యక్రమ నిర్వహణపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో మంగళవారం మహిళా కమిషన్‌ అడ్వయిజరీ డైరెక్టర్‌ సూయజ్‌, ఉన్నత విద్య మండలి చైర్మన్‌ మధుమూర్తితో కలిసి ఆమె వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. శైలజ మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో పరిశోధనలు జరపాలని సూచించారు. పరిశోధనలు చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, ఈ సర్టిఫికెట్లు ఉద్యోగ నియామకాలు, కళాశాలల్లో సీట్లు సంపాదించడానికి రిజర్వేషన్లుగా పనిచేస్తాయని తెలిపారు.

Updated Date - Feb 25 , 2026 | 05:27 AM