పీజీ సెంటర్ నుంచి వర్సిటీ వరకు..
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:55 PM
కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి.
అంచెలంచెలుగా ఎదిగిన కాకతీయ యూనివర్సిటీ
నేటితో 50 ఏళ్లు పూర్తి
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి. 1976 ఆగస్టు 20న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వర్సిటీ పరిపాలన భవనానికి శంకుస్థాపన చేశారు. తెలుగు, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ విభాగాలతో సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1968లో ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్‌గా పురుడు పోసుకుంది.
తర్వాత 1976 ఆగస్టు 20న కాకతీయ యూనివర్సిటీ ఏర్పడింది. కేయూలో సామాజిక శాస్త్రాలు, సైన్స్, కామర్స్, లా, ఫార్మసీ, ఇం జనీరింగ్, ఎడ్యుకేషన్‌లో ఏటేటా వేలాదిమంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. తెలంగాణలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నిత్యం వర్ధిల్లుతోంది. ఉస్మానియా వర్సిటీ తర్వాత రెండో అతిపెద్ద వర్సిటీగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి విద్యను అందిస్తోంది. గతంలో కరీంనగర్ శాతవాహన వర్సిటీ స్థాపనకు ముందు ఉమ్మడి కరీంనగర్ విద్య కార్యకలాపాలన్నీ కేయూ నేతృత్వంలోనే నిర్వహించేవి.
50 ఏళ్ల ప్రస్థానం
కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల విద్యా ప్రస్థానం స్ఫూర్తితో భవిష్యత్ లక్ష్యాల వైపు పోతోంది. 2025లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ వేడుకలతో స్వర్ణోత్సవ సంబురాలను ఘనంగా ప్రారంభించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంతో పాటు పరిపాలన సంస్కరణలు చేపడుతున్నారు.
పెరిగిన బడ్జెట్
కేయూకు గతంలో కంటే ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్‌ను ఈ ఏడా ది కాస్త పెంచింది. ప్రభుత్వం అందించిన బడ్జెట్, బ్లాక్‌గ్రాంట్ సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయూలకు ప్రాధాన్యతను కల్పించారు.
సిలబస్‌లో మార్పులు
కేంద్రం నూతనంగా తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ ఏడాది నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో కొత్త సిలబ్‌సను తెచ్చారు. డిజిటల్ విద్య సౌకర్యాల విస్తరణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. నైపుణ్యాలు, ఉపాధి, ఆవిష్కరణలతోపాటు ఔత్సాహికులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 800 మందికి నూతనంగా ప్లేస్‌మెంట్ కల్పించారు. రుసా నిధులతో పరిశోధన కేంద్రా ల ఏర్పాటు, కేహబ్‌లను అభివృద్ధి చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే గ్రంథాలయానికి నిధులను పెంచారు. విద్యార్థుల సంక్షేమం, హాస్టళ్లు, రహదారు లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును చేశారు. అకడమిక్ బ్లాక్‌లు, వర్క్‌షా్‌షలు, సెమినార్ హాళ్లు, స్వర్ణోత్సవ పైలాన్‌కు ఏర్పాటు చేయనున్నారు.
కార్యకలాపాలు
కేయూ పరిధిలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో వర్సిటీ పీజీ సెంటర్లు విద్యార్ధులకు పీజీ కోర్సుల్లో విద్యను అందిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News