ఏపీపీజీసెట్-2026 పరీక్ష ఫలితాలు విడుదల.. స్పందించిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - May 29 , 2026 | 04:43 PM
ఏపీపీజీసెట్(APPGCET)-2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
అమరావతి, మే 29: ఏపీపీజీసెట్(APPGCET)-2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు పడిన కష్టానికి, పట్టుదలకు ఈ ఫలితాలు ప్రతీకలని ఆయన అభివర్ణించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు.. ఉన్నత విద్య, పరిశోధనల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ ఏపీపీజీసెట్ ర్యాంక్ కార్డులు వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు.
వాట్సప్ సేవల కోసం 9552300009 నంబర్ వినియోగించుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ఏపీపీజీసెట్(APPGCET)-2026 పరీక్షలను సజావుగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (Andhra Pradesh State Council of Higher Education) అధికారులకు మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుమతి లేకున్నా.. అడ్మిషన్లు..!
Joint CSIR UGC-NET జూన్ 2026 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
For More Education News And Telugu News