వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:22 AM
వారఫలాలు.. 22 - 28 నవంబర్ 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అనవసర జోక్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యమి వ్వండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ధనసహాయం తగదు. మీ అయిష్టతను సౌమ్యంగా తెలియ జేయండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పనులు వేగవంతమవుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచించొద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు సానుకూలమవు తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యత వహించవలసి వస్తుంది. పిల్లలకు శుభఫలితాలున్నాయి. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. తొందరపాటు నిర్ణయం తగదు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ప్రతికూలతలు అధికం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సం భాషణ ఉత్సాహపరుస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. దుబారా ఖర్చులు విపరీతం. నోటీసులు అందుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహంలో మార్పు చేర్పులు అనుకూలిస్తాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వ స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ చిన్నచూపు చూడవద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. తొందరపడి మాట ఇవ్వవద్దు. అవతలివారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించు కోవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ఆహ్వానం అందుకుంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

కార్యక్రమాలు విజయవం తంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. పరిచయాలు ఉన్నతికి సహకరిస్తాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం సంతృప్తికరం. సన్నిహితులతో తరచుగా సం భాషిస్తుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్య పడవు. సామరస్యంగా మెలగండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లావాదేవీల్లో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయం తగదు. నిపుణుల సలహా పాటించండి. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. ప్రయాణం సజావుగా సాగుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. సాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అవసరాలు వాయిదా పడ తాయి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆహ్వానం అందుకుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కొత్త యత్నాలు చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ఆటంకాలు ఎదురైనా పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి రుణాలు మంజూరవుతాయి. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. సామాజిక, దైవకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వ్యవహారాలతో తీరిక ఉండదు. నిర్విరామంగా శ్రమిస్తారు. పనిభారం, అకాల భోజనం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కార్యసిద్ధి, వ్యవహారజయం ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు సన్నిహి తులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. కొత్త యత్నాలు చేపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఏ పనీ చేయబుద్థి కాదు. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముఖ్యమైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి.