Share News

స్వదేశీ బ్రాండ్‌.. సత్తా చాటేందుకు రెడీ!

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:56 AM

ఆంధ్రప్రదేశ్‌ గడ్డపై పుట్టిన స్వదేశీ బ్రాండ్‌ ప్రపంచ మార్కెట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

స్వదేశీ బ్రాండ్‌.. సత్తా చాటేందుకు రెడీ!

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ గడ్డపై పుట్టిన స్వదేశీ బ్రాండ్‌ ప్రపంచ మార్కెట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద శీతలపానీయాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

శంకుస్థాపన జరిగిన 12 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించిన ఈ భారీ పరిశ్రమ విజయగాథను అందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. గతేడాది నవంబరులో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన జరిగిందని తెలిపారు. తాము చెబుతున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సకు ఈ ప్లాంటు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే స్థానికులకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 08:05 AM