Share News

అనిరుధ్‌-కావ్య మారన్‌ రిసెప్షన్‌కు లోకేశ్‌ దంపతులు

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:51 AM

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ టీం సీఈవో కావ్య మారన్‌ వివాహ రిసెప్షన్‌ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.

అనిరుధ్‌-కావ్య మారన్‌ రిసెప్షన్‌కు లోకేశ్‌ దంపతులు

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ టీం సీఈవో కావ్య మారన్‌ వివాహ రిసెప్షన్‌ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ మంత్రి లోకేశ్‌, బ్రాహ్మణి దంపతులు, తనయుడు దేవాన్ష్‌ హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు. రిసెప్షన్‌కు విచ్చేసిన తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌, సినీనటుడు రజనీకాంత్‌, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌లను లోకేశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

రజనీకాంత్‌ ఆప్యాయంగా లోకేశ్‌తో ముచ్చటించారు. అటు రాజ్యసభ ఎంపీ, డీఎండీకే పార్టీ నేత ఎల్‌కే సుధీశ్‌, ఎల్‌కేఎస్‌ గ్రూపు ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ పూర్ణ జ్యోతి దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా లోకేశ్‌ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:55 AM