Share News

పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:24 AM

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని బంధించేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి...

పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు

  • ప్రజల భద్రతకు చర్యలు: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని బంధించేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. పులిని పట్టుకోవటానికి తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన అటవీ శాఖ అధికారులతో చర్చించారు. పులి సంచార ప్రాంతంలో హనుమాన్‌ బృందాలతో పాటు థర్మల్‌ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమేరా ట్రాప్‌లతో నిఘా పెట్టాలని, అధునాతన సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన ఇతర రాష్ట్రాల వన్యప్రాణి నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి పులి ట్రాకింగ్‌, రెస్క్యూ టీమ్‌లను రప్పించి, ఆపరేషన్‌ సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. పులి సంచార ప్రదేశాలను గుర్తిస్తూ, పులి కదలికల సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయాలని నిర్దేశించారు. రైతులు, పశుకాపరులు, స్థానికులు అటవీ ప్రాంతాలకు, ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు. పులి వల్ల ప్రజలకు ఎలాంటి హాని లేకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా పులిని సురక్షితంగా బంధించాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:48 AM