ఢిల్లీ నుంచి స్పష్టత వచ్చాకే నిర్ణయం
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:41 AM
ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపి, సంతృప్తికరమైన హామీ లభించిన తర్వాతే రాజీనామాల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
రాజీనామాలపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపి, సంతృప్తికరమైన హామీ లభించిన తర్వాతే రాజీనామాల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పరిషత్ పీఠం తమ కుటుంబ సభ్యుడికి దక్కక పోవడంతో అలకబూనిన జమ్మలమడుగు ఎమ్మెల్యే... పదవులకు రాజీనామా చేస్తానంటూ శుక్రవారం నుంచి పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు.
విజయవాడలోని ఒక హోటల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వంపై చంద్రబాబు, లోకేశ్‌తో జరిపిన చర్చలు సంతృప్తికరంగా లేవు. నా అసంతృప్తిని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేశా. ఢిల్లీకి సమగ్ర నివేదిక రాష్ట్ర పార్టీ పంపింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యాక ఢిల్లీకి రావాలని సూచించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీఎల్ సంతోశ్, అమిత్ షా తదితరులతో సమావేశమై అన్ని అంశాలు వివరిస్తా’ అని తెలిపారు. వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని, మంత్రి పదవికోసం బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు వినిపిస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. పదవుల కేటాయింపులో కూటమి పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉండాలన్నదే తన అభిమతమన్న ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి