Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Nov 15 , 2026 | 07:37 AM

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే? 15 - 21 నవంబర్‌ 2026, పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgసర్వత్రా అనుకూలం. తల పెట్టిన కార్యం సిద్థిస్తుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. బాధ్యతగా మెల గాలి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంస్థలు, ప్రాజె క్టుల స్థాపనకు అనుకూలం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలో భాలకు లొంగవద్దు. ప్రతీవిషయంస్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలకు శుభపరిణామాలున్నాయి.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgఅవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. సంస్థల స్థాపనకు రుణం మంజూర వుతుంది. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. కావలసిన వ్యక్తుల కలయిక వీలు పడదు. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgసంప్రదింపులు సంతృప్తిని స్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మాన సికంగా స్థిమితపడతారు. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆచితూచి అడుగు వేయండి. దూరపు బంధువుల ఆహ్వానం అం దుకుంటారు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgప్రతికూలతలు అధికం. ఆలోచ నలు నిలకడగా ఉండవు. అన్యమనస్కంగా గడుపుతారు. రావలసిన ధనం సమయానికి అందదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgకొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. కార్య దీక్షతో ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం. వాహనం కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ముఖ్యమైన పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల చొరవతో సమస్య పరిష్కారమవుతుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgవ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, అకాలభోజనం. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని నిశితంగా గమనించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgశుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల్లో శ్రమ అధికం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనో ధైర్యంతో ముందుకు సాగుతారు. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. నిపుణుల సలహా పాటించండి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgకార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో వివాహసంబంధం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgఆదాయం బాగున్నా ధనం నిలవదు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పోయాయనుకున్న పత్రాలు కనిపిస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgవ్యవహారానుకూలత ఉంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. ఏ పని చేయబుద్ధికాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక ఆహ్వానం సంతోష పరుస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. పట్టుదలతో మరోసారి యత్నించండి.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgఅన్నిరంగాల వారికీ అనుకూలమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు ఒక పట్టాన సాగవు. పరిచయస్తుల రాక చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meenam.jpgవ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమవుతుంది. వాహనసౌఖ్యం, ధనలాభం పొందుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనకు రుణాలు మంజూరవుతాయి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి రూపాన్ని గీసిన తొలి చిత్రకారుడు కన్నుమూత

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 07:37 AM