Share News

ఆసక్తి ఉంటే 1-12 తరగతులు పెట్టుకోండి

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:23 AM

ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడం కేవలం విద్యార్థుల ప్రయోజనం కోసం మాత్రమేనని ఇంటర్‌ విద్య కార్యదర్శి అభిలాష స్పష్టం చేశారు.

ఆసక్తి ఉంటే 1-12 తరగతులు పెట్టుకోండి
Abhilasha

  • కాలేజీలకు ఇంటర్‌ విద్య కార్యదర్శి అభిలాష స్పష్టీకరణ

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడం కేవలం విద్యార్థుల ప్రయోజనం కోసం మాత్రమేనని ఇంటర్‌ విద్య కార్యదర్శి అభిలాష స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఇంటర్‌ విద్యా విధానాన్ని సమగ్రంగా సమీక్షించాకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని తేల్చిచెప్పారు. శనివారం తన కార్యాలయంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో అభిలాష సమావేశమయ్యారు.


ఈ భేటీలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్‌తోపాటు 22 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఆసక్తి ఉంటే 1-12వ తరగతి వరకూ బోధన నిర్వహించవచ్చని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనుమతులు జారీచేస్తామని అభిలాష చెప్పారు. వచ్చే ఏడాది నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలన్న పరిమితి ఏమీ లేదని.. వచ్చే ఏడాది కొన్ని తరగతులను, తర్వాత మరిన్ని తరగతులూ ప్రారంభించుకోవచ్చని సూచించారు. కాగా పాఠశాల విద్యలో ఇంటర్మీడియ్‌ విలీనంపై విద్యావేత్తలు, నిపుణుల నుంచి కూడా ప్రభుత్వం సూచనలు, సలహాలు తీసుకుంటోంది. ఈ నెలాఖరులోగా దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Updated Date - Nov 15 , 2026 | 06:23 AM