Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Nov 29 , 2026 | 07:04 AM

29 నవంబర్‌ - 5 డిసెంబర్‌ 2026, పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham...jpgఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయానికి బడ్జెట్‌ వేసుకుంటారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. శుభలేఖ అందుకుంటారు. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఆరోగ్యం జాగ్రత్త. శుభకార్యానికి హాజరవు తారు. ఇంటిని అలక్ష్యంగా వదిలివెళ్లకండి.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabam.jpgఅనుకున్న కార్యం నెరవేరుతుంది. సమయస్ఫూర్తితో మెలుగుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. అయినవారి ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgవ్యవహారానుకూలత ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. నిపుణులను సంప్రదించండి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభ మవుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgలావాదేవీల్లో ఆచితూచి అడుగేయాలి. తొందరపాటుతనం వల్ల కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పత్రాల్లో సవరణలు అనివార్యం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త యత్నాలు మొదలెడతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgసంప్రదింపులు ఫలిస్తాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికసమస్యలు సద్దుమణుగు తాయి. మానసికంగా కుదుటపడతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాలు అందుతాయి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgఅన్ని విధాలా అనుకూలం. మీ శ్రమ ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్య తలెత్తే సూచనలున్నాయి. మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgతలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమర్థతను చాటుకుంటారు. సంప్ర దింపులు ఫలిస్తాయి. రాదనుకున్న ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొందరి తీరుపై సందేహం కలుగుతుంది. సమయస్ఫూర్తితో మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgవ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టిపెడతారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. స్నేహసంబం ధాలు బలపడతాయి. గృహమార్పు తప్పని సరి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. బంధుమిత్రులతో సంభాషి స్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgపరిస్థితులు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో మెలుగుతారు. కొత్త ఆలోచ నలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పనుల్లో శ్రమ. చికాకులు అధికం. మొండిబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అప్రమత్తంగా ఉండాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgలావాదేవీలతో తీరిక ఉండదు. లక్ష్యానికి చేరువవుతున్నారు. ఉత్సాహంగా యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించ వద్దు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. ఇతరుల కోసం విపరీ తంగా వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. కష్ట మనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgస్థిరాస్తిధనం అందుతుంది. ఖర్చులు సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యక్తుల వద్ద మదుపు క్షేమం కాదు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meenam.jpgవ్యవహారజయం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. శుభలేఖ అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ఉల్లాసంగా కాలం వెళ్లదీస్తారు. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రజలందరూ కూటమివైపే: ఎమ్మెల్యే గద్దె

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 07:04 AM