రాజ్యాంగ విలువలపై దాడి పెరుగుతోంది!
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:14 AM
రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక సంస్థలు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయని ప్రముఖ రచయితలు, కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు
కవులు, రచయితలు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖుల ఆందోళన
జాతీయ సదస్సులో డిక్లరేషన్ విడుదల
న్యూఢిల్లీ, నవంబరు 28: రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక సంస్థలు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయని ప్రముఖ రచయితలు, కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సృజనాత్మక స్వేచ ్ఛను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జవహర్ భవన్‌లో నిర్వహించిన రచయితలు, కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖుల జాతీయ సదస్సులో శనివారం ఈ మేరకు డిక్లరేషన్‌ను విడుదల చేశారు. డిక్లరేషన్‌పై సంతకాలు చేసినవారిలో రచయితలు అరుంధతీరాయ్, మృదుల గార్గ్, ఎన్‌ఎస్ మాధవన్, ఖాలిద్ జావెద్, ఎంకే రైనా, గణేశ్ దేవీ, కాజీ నీల్, గౌహర్ రజా, కవి అశోక్ వాజ్‌పేయి, నృత్యకారిణి మల్లికా సారాభాయ్ తదితరులు ఉన్నారు. జాతీయ, సామాజిక వైవిధ్యాన్ని సంకుచిత మనస్తత్వంతో ఏకరూపతగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని వీరంతా ఆక్షేపించారు. బహుళత్వ, ప్రజాస్వామ్య, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన సమాజంగా గుర్తింపు పొందిన భారతదేశ మూల అస్థిత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.