వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 07 , 2026 | 07:46 AM
ఈ వారం రాశిఫలాలు.. 7 -13 జూన్ 2026
ఈ వారం రాశిఫలాలు.. 7 -13 జూన్ 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడ తాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగు తారు. ఆదాయం సంతృప్తికరం.పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పనులు ఒక పట్టాన పూర్తికావు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహ పరుస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో పునరాలో చన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడ తాయి. గృహమరమ్మతులు చేపడతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ధైర్యంగా అడుగు ముందు కేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితు లతో సంప్రదిస్తారు. పనులు సానుకూలమవు తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దు మణుగుతుంది. ఆరోగ్యం నిలకడగాఉంటుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలు చేపడతారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే అసహనం చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉం చుకోండి. బంధువర్గాలతో విభేదిస్తారు. ఆత్మీ యుల చొరవతో ఒక సమస్య పరిష్కారమవు తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పిల్లల ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కనిపించ కుండాపోయిన పత్రాలు లభ్యమవుతాయి.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొత్త సమస్యలు తలెత్త కుండా జాగ్రత్త వహించండి. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఊహించని ఖర్చు తగులుతుంది. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. నోటీసులు అందు తాయి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సర్వదా యోగదాయకమే. అనుకున్న కార్యం సఫలమవుతుంది. చాక చక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అందరితోనూ మితంగా సంభాషించండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుం టారు. పిల్లలకు శుభఫలితాలున్నాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్య క్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి పరి చయస్తులు తారసపడతారు. ఆరోగ్యంజాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. అనవసర జోక్యం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో మెలగండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కార్యక్రమాలు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కొత్త సమస్య ఎదురవుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విష యానికే ఆందోళన చెందుతారు. కావలసిన పత్రాలు, వస్తువులు సమయానికి కనిపించవు. కొందరి వ్యాఖ్యలు అసహనం కలిగిస్తాయి. సంయమనం పాటించండి. ఖర్చులు విపరీ తం. నోటీసులు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. సన్నిహితులతో సంభాషిస్తారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. విందులు, వేడుకలకు హాజరవుతారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు, కృషి ముఖ్యం. ఆచితూచి అడుగేయాల్సిన సమ యం. సలహాలు, సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేసిన పనులు మొదటికే వస్తాయి. చిన్న విషయానికే అసహనం చెందుతారు. సన్నిహి తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. స్థిర చరాస్తుల వ్యవహారంలో మెలకువ వహిం చండి. తొందరపాటు నిర్ణయం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఒప్పందాల్లో ఏకాగ్రత వహిం చండి. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిచ యస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. కొత్త యత్నాలను చేపడతారు. కొన్ని అవకా శాలు అనుకోకుండా కలిసివస్తాయి. అందరి తోనూ మితంగా సంభాషించండి. నోటీసులు అందుకుంటారు. అయినవారి మధ్య కొత్తవిషయాలు ప్రస్తావనకు వస్తాయి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలువుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కన్సల్టెన్సీలను ఆశ్ర యించొద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పలు కుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడ తాయి. ప్రణాళికాబద్థంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తుంటారు. కనిపించకుండాపోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. అర్థాం తరంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. ఉల్లా సంగా గడుపుతారు. వాహనం సమకూర్చుకోవాలనే కోరిక తీరుతుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
ఈ వార్తలు కూడా చదవండి:
తేడా రావొద్దు! పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా
సీఎం రేవంత్‌వి దేశద్రోహ వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News