Share News

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న పతనం

ABN , Publish Date - Jun 07 , 2026 | 07:01 AM

భారత్‌లో బంగారం ధరలు అంతకంతకూ పతనం అవుతున్నాయి. గత మూడు రోజుల పాటు వరుసగా ధరల్లో కోత పడింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న పతనం
Gold, Silver Rates on Jun 7

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. గత మూడు రోజులగా బంగారం ధరల్లో కోత పడింది. వెండి ధరల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మార్కెట్స్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 7, ఆదివారం) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,730గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,40,000ల వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలుగా ఉంది. విజయవాడలో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,910గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730ల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1.4 లక్షల వద్ద కొనసాగుతోంది. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,910గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది. నిన్న భారత్‌లో మేలిమి బంగారం సగటు ధర రికార్డు స్థాయిలో రూ.3 వేల మేర తగ్గింది. వెండి ధరలో రూ.10 వేల మేర కోత పడింది.


ఈ వార్తలనూ చదవండి:

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

Updated Date - Jun 07 , 2026 | 07:16 AM