ఆ రాశివారు ఈవారం శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు..
ABN , Publish Date - Mar 08 , 2026 | 08:09 AM
ఈ వారం రాశిఫలాలు.. 8 - 14 మార్చి 2026. ఆ రాశివారు ఈవారం శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు..
అనుగ్రహం
8 - 14 మార్చి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. కానుకలిచ్చి పుచ్చుకుంటారు. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. కీలక పత్రాలు జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అనవసర విషయాల జోలికి పోవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. అతిగా శ్రమించవద్దు. చర్చలో పాల్గొంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందు కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలు పడదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహ పరుస్తుంది. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. చిన్న విషయానికే అతిగా చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచించొద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. అవకాశాలు కలిసివస్తాయి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారజయం, కార్యసిద్థి ఉన్నాయి. స్దిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయుల చొరవతో సమస్య పరిష్కారమవు తుంది. కొత్త యత్నాలు చేపడతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం శూన్యం. మనోధైర్యంతో మెలగండి. యత్నాలు విరమిం చుకోవద్దు. నేడు అనుకూలించని పరిస్థితులు రేపు చక్కబడతాయి. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుకోని ఖర్చు తగులుతుంది. అవసరాలు వాయిదా వేసుకుం టారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచించొద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒత్తిళ్లకు గురికావద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సౌమ్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆహ్వానం అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజ పరుస్తుంది. ఫోన్ సందేశాలను పట్టించు కోవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. విలాసాలకు ఖర్చుచేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
స్థిరాస్తి ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి పరిచయ స్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదిం పులు జరుపుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పిల్లల చదువులపై దృషి ్టపెట్టండి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. శ్రమిం చినా ఫలితం శూన్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగిం చండి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. నోటీసులు అందుతాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. సోదరవర్గం బంధువులతో వివాదాలు తలెత్తు తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ము ఖులను చేస్తాయి. నూతన యత్నాలు చేపడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న కార్యం సిద్థిస్తుంది. సంప్రధింపులు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవు తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు లుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News