రూ.30 లక్షల లాటరీ.. ఎక్కడున్నాడో తెలియని విజేత.. ఏం చేస్తున్నారంటే..
ABN , Publish Date - Mar 08 , 2026 | 07:36 AM
సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్‌కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుటుంది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్‌కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుటుంది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. 50 రూపాయలతో లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి రూ.30 లక్షల లాటరీ తగిలింది. అయితే విజేత ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో నిర్వాహకులు డప్పులు, మైకులతో అతడి కోసం చాటింపు వేయిస్తున్నారు (Punjab lottery winner).
పంజాబ్‌లో నెలవారీ లాటరీ నిర్వహించే ఓ సంస్థ ఫిబ్రవరి 26న విజేతలను ప్రకటించింది. ఇందులో బర్నాలా రైల్వేస్టేషను సమీపంలోని ఓ ఏజెంట్ దగ్గర టికెట్ కొన్న వ్యక్తికి లాటరీ తగిలింది. అయితే ఆ టికెట్‌పై విజేత పేరు, ఫోన్ నెంబర్ లేదు. దీంతో ఆ వ్యక్తిని నిర్వాహకులు పట్టుకోలేకపోతున్నారు. లాటరీ టికెట్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తి తమ వద్దకు వస్తాడేమోనని ఎదురు చూస్తున్నారు (Missing lottery winner Punjab).
విజేత జాడ కోసం మైకులు, డప్పులతో గల్లీలలో చాటింపు వేయిస్తున్నారు (Punjab lottery news). ఆచూకీ తెలిస్తే స్వాగతం పలికేందుకు తమ ప్రాంగణాన్ని డెకరేట్ చేశారు. అయితే ఇప్పటివరకు అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. విజేతను ప్రకటించిన తర్వాత నెల రోజుల్లోపు ప్రైజ్‌మనీ తీసుకోకపోతే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్లిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి: