అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మీ ఆత్మీయులకు ఇలా విషెస్ చెప్పండి
ABN , Publish Date - Mar 08 , 2026 | 07:09 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులకు స్పెషల్‌గా ఈ కోట్స్‌తో విషెస్ చెప్పండి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. మహిళలను గౌరవించడానికి, వారి సహకారాలను, విజయాలను గుర్తించడానికి ఈ రోజును అంకితం చేస్తారు. 1908లో న్యూయార్క్‌లో పని గంటలు, వేతనాల విషయంలో మహిళా కార్మికులు మొదటి నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి, మహిళల సాధికారత, సమానత్వం కోసం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1975లో ఐకరాజ్య సమితి ఈ రోజును అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంలో, ప్రతి మహిళా.. తల్లి, సోదరి, స్నేహితురాలు, సహోద్యోగిని గౌరవిస్తూ ప్రేమతో స్పెషల్‌గా ఈ కోట్స్‌తో విషెస్ చెప్పండి.
విషెస్ కోట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
స్నేహితులు, ఆత్మీయులకు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
'కన్నతల్లిగా లాలిస్తావు.. కంటికి రెప్పాలా కాపాడతావు.. కల్మషం లేని ప్రేమను అందిస్తావు.. చివరి శ్వాస వరకూ ప్రేమిస్తావు' హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
సహనమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
కుటుంబ భారాన్ని మోస్తూ.. ఉద్యోగ బాధ్యతలను నెరవేస్తున్న మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మగా అనురాగం, భార్యగా భాగస్వామ్యం, అక్కగా అండగా ఉంటూ.. నా జీవితంలో ప్రతి పాత్రను పోషిస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీ శక్తి ప్రతిరూపమై,ఆదర్శంగా నిలుస్తున్న అతివలందరికీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
కొవ్వొత్తిలా కరుగుతూ.. కుటుంబానికి వెలుగునిస్తూ.. కుటుంబమే సర్వస్వంగా జీవించే మహిళలందరికీ.. హ్యపీ ఉమెన్స్ డే 2026
ప్రతి కష్టంలో, సంతోషంలో తోడుగా ఉన్న మహిళా మణులకు హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
నా జీవితంలో ఆనందాన్ని నింపిన అద్భుతమైన మహిళలందరికి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
Also Read:
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. మహిళలను సర్‌ప్రైజ్ చేసే గిఫ్ట్ ఐడియాస్
2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. థీమ్, చరిత్ర ఇదే..