ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. మహిళలను సర్‌ప్రైజ్ చేసే గిఫ్ట్ ఐడియాస్
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:37 AM
మన జీవితంలో తల్లి, సోదరి, భార్య, స్నేహితురాలు లేదా సహోద్యోగి వంటి మహిళలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇవ్వగల కొన్ని మంచి గిఫ్ట్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళల కృషిని గౌరవిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆదివారం మంచి అవకాశం. మన జీవితంలో తల్లి, సోదరి, భార్య, స్నేహితురాలు లేదా ఆఫీసు సహోద్యోగి వంటి మహిళలు ఎప్పుడూ మనకు మద్దతుగా ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన మహిళలకు చిన్న బహుమతి ఇచ్చి మన ప్రేమను తెలియజేయవచ్చు. మహిళలకు బహుమతిగా ఇచ్చే వస్తువులు కేవలం అందంగా ఉండటం మాత్రమే కాకుండా వారికి ఆనందం, విశ్రాంతి కలిగించేలా ఉండాలి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వగల కొన్ని మంచి గిఫ్ట్ ఏవో చూద్దాం..
స్కిన్ కేర్ గిఫ్ట్ సెట్
చాలా మంది మహిళలు తమ చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కాబట్టి మహిళా దినోత్సవం నాడు స్కిన్ కేర్ గిఫ్ట్ సెట్ ఇవ్వడం మంచి ఆలోచన. ఇందులో క్లెన్సర్, టోనర్, ఫేస్ మాస్క్, విటమిన్ C సీరమ్, మాయిశ్చరైజర్ వంటి వస్తువులు ఉంటాయి. అలాగే, బాడీ కేర్ గిఫ్ట్ సెట్ కూడా మహిళలకు ఇవ్వొచ్చు. ఇందులో బాడీ స్క్రబ్, షవర్ క్రీమ్, బాడీ బటర్ వంటి ఉత్పత్తులు ఉంటాయి.

పెర్ఫ్యూమ్ గిఫ్ట్స్
పెర్ఫ్యూమ్ లేదా బాడీ మిస్ట్ వంటి సువాసన గిఫ్ట్స్ కూడా మంచి ఎంపిక. పూల సువాసన లేదా తేలికపాటి ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ ఉన్న పెర్ఫ్యూమ్ ఎంచుకుంటే మరింత బాగుంటుంది. అలాగే సువాసనగల కొవ్వొత్తులు, డిఫ్యూజర్లు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.
ఆభరణాలు
మహిళలకు ఆభరణాలు ఎప్పుడూ మంచి బహుమతిగానే ఉంటాయి. మీరు కృత్రిమ ఆభరణాలు లేదా బంగారం, వెండి నగలు ఇవ్వవచ్చు. చెవిపోగులు, నెక్ చైన్, ఉంగరం లేదా కాళ్లకు వేసుకునే పట్టీలు వంటి వస్తువులు ఇవ్వొచ్చు.

కస్టమైజ్డ్ గిఫ్ట్ హ్యాంపర్
మీరు మరింత ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటే కస్టమైజ్డ్ గిఫ్ట్ హ్యాంపర్ తయారు చేయవచ్చు. ఇందులో హ్యాండ్ క్రీమ్, లిప్ బామ్, పెర్ఫ్యూమ్, నెయిల్ పెయింట్స్, చిన్న ఆభరణాలు, ఫొటో ఫ్రేమ్ లేదా హెయిర్ యాక్సెసరీలు వంటి వస్తువులను గిఫ్ట్ హ్యాంపర్‌లో పెట్టవచ్చు.
పుస్తకం
చాలా మంది మహిళలకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వారికి పుస్తకం మంచి బహుమతి అవుతుంది. మంచి పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇస్తే వారు ఖచ్చితంగా ఆనందిస్తారు.

డిన్నర్‌కు తీసుకెళ్లవచ్చు
మీ సోదరి, తల్లి లేదా భార్య ఏడాది పొడవునా కుటుంబం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు. ముఖ్యంగా వంట చేసి అందరిని బాగా చూసుకుంటారు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మీరు వారిని బయటకు డిన్నర్‌కు తీసుకెళ్లవచ్చు. ఇలా చేయడం ద్వారా వారికి కొంత విశ్రాంతి కూడా లభిస్తుంది, అలాగే మీ ప్రేమను వ్యక్తం చేసినట్టూ అవుతుంది.
మహిళా దినోత్సవం అనేది మన జీవితంలో ఉన్న మహిళలకు కృతజ్ఞతలు చెప్పే ప్రత్యేక రోజు. పెద్ద బహుమతులు అవసరం లేదు, ప్రేమతో ఇచ్చే చిన్న బహుమతి కూడా వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ 5 అలవాట్లు ఎక్కువైతే సమస్యలు తప్పవు
సమ్మర్ స్పెషల్.. ఏ జ్యూసులు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
For More Latest News