Share News

పెళ్లి రోజు అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:52 AM

పెళ్లి రోజు అందంగా కనిపించాలనే ఆశతో చాలామంది మేకప్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు మొత్తం లుక్‌ను ప్రభావితం చేయవచ్చు.

పెళ్లి రోజు అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి
Bridal Makeup Mistakes

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అనేది జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంలో అమ్మాయిలు మరింత అందంగా కనిపించాలని కోరుకుంటారు. పెళ్లి రోజు అందంగా కనిపించాలనే ఆశతో చాలామంది మేకప్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు మొత్తం లుక్‌ను ప్రభావితం చేయవచ్చు. అందుకే పెళ్లికూతుళ్లు మేకప్ చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్ల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.


అతిగా మేకప్ చేయడం

చాలా మంది పెళ్లికూతుళ్లు ఎక్కువ మేకప్ చేస్తేనే అందంగా కనిపిస్తామని భావిస్తారు. కానీ మేకప్ అంటే ముఖంపై ఎక్కువ పౌడర్లు లేదా క్రీములు వేయడం కాదు. ముఖంలోని అందాన్ని హైలైట్ చేసేలా సాఫ్ట్‌గా మేకప్ చేయడం ముఖ్యం. అతిగా మేకప్ చేస్తే సహజమైన అందం కనిపించకుండా పోయే అవకాశం ఉంటుంది.

చర్మాన్ని ముందుగా సిద్ధం చేయకపోవడం

మేకప్ చేయడానికి ముందు చర్మాన్ని సరిగ్గా సిద్ధం చేయడం చాలా అవసరం. స్కిన్ కేర్ లేకుండా నేరుగా మేకప్ వేస్తే చర్మానికి ఇర్రిటేషన్ లేదా ఎర్రబారడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పెళ్లికి కొన్ని రోజుల ముందు ఏ మేకప్ ప్రోడక్ట్స్ మీ చర్మానికి సరిపోతాయో ట్రై చేసి చూడటం మంచిది.

makeup.jpg


శరీరానికి సరిపోని దుస్తులు ఎంచుకోవడం

మేకప్‌తో పాటు దుస్తులు కూడా మొత్తం లుక్‌లో ముఖ్యమైన భాగం. ప్రతి ఒక్కరికి అన్ని రకాల డ్రెస్‌లు సరిపోవు. కాబట్టి మీ శరీరాకృతికి సరిపోయే డ్రెస్‌ను ఎంచుకోవాలి. మార్కెట్లో ట్రెండ్‌లో ఉందని గుడ్డిగా అదే స్టైల్‌ను ఎంచుకోవడం మంచిది కాదు.

చెప్పుల ఎంపికలో నిర్లక్ష్యం

పెళ్లి సమయంలో చాలా సేపు నిలబడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫొటోలు తీసుకునేటప్పుడు ఇది మరింత ఎక్కువ అవుతుంది. అందుకే చెప్పులు ఎంచుకునేటప్పుడు కేవలం స్టైల్ కాకుండా కంఫర్ట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువ ఎత్తు ఉన్న హైహీల్స్ వేసుకుంటే అసౌకర్యంగా అనిపించవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ 5 అలవాట్లు ఎక్కువైతే సమస్యలు తప్పవు

సమ్మర్‌ స్పెషల్.. ఏ జ్యూసులు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

For More Latest News

Updated Date - Mar 07 , 2026 | 10:54 AM