Share News

2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. థీమ్, చరిత్ర ఇదే..

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:40 PM

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఆ రోజునే మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? దాని చరిత్ర, ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసుకుందాం..

2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం..  థీమ్, చరిత్ర ఇదే..
International Women’s Day 2026

ఇంటర్నెట్ డెస్క్: మార్చి 8 మహిళలకు ప్రత్యేకమైన రోజు. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళల సాధన, కృషి, విజయాలను గుర్తించి, లింగ సమానత్వం, హక్కులను హైలైట్ చేస్తారు. అయితే, మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? దాని చరిత్ర, ఈ ఏడాది థీమ్ ఏంటో చూద్దాం..


2026 మహిళా దినోత్సవం: థీమ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. 2026కు సంబంధించి మహిళా సాధికారత, సమానత్వం, నాయకత్వంపై దృష్టి సారిస్తూ థీమ్ రెడీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఈసారి ప్రత్యేక థీమ్ 'Give To Gain', అంటే ఒకరికి ఒకరు సహాయం చేస్తే, అందరికీ ప్రయోజనం కలుగుతుందని, సమాజంలో పురోగతి సాధ్యమవుతుందని ఈ థీమ్ సూచిస్తుంది.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట అమెరికాలో 1900లో ప్రారంభమైంది. ఆ కాలంలో మహిళలకు ఎక్కువగా పని గంటలు ఉంటూ జీతం తక్కువగా ఉండేది. ఆ పరిస్థితిని తట్టుకోలేని మహిళలు వారి హక్కుల కోసం తిరుగుబాటు మొదలుపెట్టారు. వారు తగిన వేతనం, పని గంటలు తగ్గించడం, ఓటు హక్కు వంటి అంశాలపై పోరాటాలు చేశారు. 1910లో సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఈ ఉద్యమానికి మద్దతుగా నేషనల్ ఉమెన్స్ డేని ప్రారంభించింది. ఇందులో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా పాల్గొన్నాయి. తర్వాత, ఐక్యరాజ్య సమితి (UN) 1975లో ఈ రోజును అధికారికంగా గుర్తించింది. 1977 నుంచి మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, విద్యాసంస్థలు మహిళల సాధన, సమాన హక్కులు గుర్తుచేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


ప్రాముఖ్యం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించి, గౌరవించే రోజు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, మహిళా సాధికారతను చాటడం, మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.


ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Latest News

Updated Date - Mar 05 , 2026 | 02:13 PM